📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Bigg Boss Telugu 9 – బిగ్ బాస్ 9 ఆఫర్‌ను రిజెక్ట్ చేశా : దివ్వెల మాధురి

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 10:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరికి అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 07) సాయంత్రం స్టార్ మా ఛానెల్‌లో ఘనంగా స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రతి సీజన్‌లో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించే బిగ్ బాస్ (Bigg Boss Telugu 9), ఈసారి కూడా కాస్త భిన్నంగా ఎంట్రీ ఇచ్చాడు.మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్‌లో పాల్గొంటున్నారు. వీరిలో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్. మొదటి ఎపిసోడ్‌లో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పరిచయం చేస్తూ, వారికి బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యేక ఎంట్రీ ఇచ్చారు.

మొత్తం 15 మంది కంటెస్టెంట్స్

9 మంది సెలబ్రిటీల కోటాలో, ఆరుగురు కామనర్స్ క్యాటగిరీలో బిగ్ బాస్ 9 హౌస్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. భరణి, తనూజ, శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్‌, రాము రాథోడ్‌, సుమన్‌ శెట్టి, సంజనా గల్రానీ సెలబ్రిటీలుగా హౌస్ లోకి అడుగు పెట్టగా, మర్యాద మనీష్‌, పవన్‌ కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, దమ్ము శ్రీజ, ప్రియాలు, హరీష్‌ కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కామనర్స్ మెయిన్‌ హౌస్‌లో ఉంటుండగా, సెలబ్రిటీలు మాత్రం ఔట్ హౌస్ లో ఉన్నారు.

మొత్తానికి ఓనర్స్ వెర్సస్ టెనెల్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య బాగానే పోటీ పెట్టాడు బిగ్ బాస్. అయితే ఈ సీజన్ మొదలు అవ్వకముందే హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు అనేది సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. దాదాపు వారే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే మొదటి నుంచి కంటెస్టెంట్ల లిస్టులో వినిపించిన దివ్వెల మాధురి (Divvela Madhuri) మాత్రం బిగ్ బాస్ 9 హౌస్ లోకి రాలేదు.

Latest News

రాజా కి దూరం గా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టం

ఇటీవలే తన దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లింది దివ్వెల మాధురి. అక్కడ బిగ్ బాస్ 9 ఆఫర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నాకు ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే. కానీ అన్ని రోజులు నా రాజా కి దూరం గా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టం గా అనిపించింది. నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను, ఆయన కూడా ఉండలేడు. అందుకే నేను బిగ్ బాస్ 9 ఆఫర్ ని రిజెక్ట్ చేశాను’ అని చెప్పుకొచ్చింది మాధురి.ఇక ఇదే విషయంపై దువ్వాడ శ్రీనివాస్ కూడా ఓ సందర్భంలో స్పందించారు.

‘మాకు బిగ్‌బాస్‌ నుంచి కబురు వచ్చింది నిజమే. స్వయంగా బిగ్‌బాస్‌ టీం వచ్చి మమ్మల్ని కలిసింది. మాధురిని బిగ్ బాస్ లోకి తీసుకుంటామని అడిగారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ టైంలో తను బిగ్‌బాస్‌కి వెళితే.. అంతా డిస్టర్బ్‌ అవుతుందనిపిస్తోందని.. అందుకే బిగ్ బాస్ ఆఫర్ ను వద్దనుకున్నాం’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కాకపోయినా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా నైనా దివ్వెల మాధురి హౌస్ లోకి అడుగు పెట్టనుందని ప్రచారం జరుగుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-asia-cup-2025-asia-cup-2025-cricket-tournament-begins/international/544245/

Bharani Bigg Boss 9 grand launch Bigg Boss Telugu contestants list Bigg Boss Telugu Season 9 Breaking News Flora Saini latest news Srishti Varma Tanuj Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.