📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: bigg Boss 9: సంజన, తనూజ మధ్య గొడవ, కెప్టెన్ డీమాన్ పవన్ పై సంజన ఫైర్

Author Icon By Pooja
Updated: September 30, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిగ్‌బాస్ సీజన్ 9 లో మూడు ఎలిమినేషన్లు (శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ) పూర్తయ్యాయి. ప్రస్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో కిచెన్ విషయంలో కంటెస్టెంట్ సంజన మరియు తనూజ మధ్య తీవ్ర వాగ్వాదం(Intense argument) జరిగింది. ఈ గొడవ మధ్యలోకి కెప్టెన్ డీమాన్ పవన్ రావడంతో, సంజన అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

ఈ సీజన్ మొదటి వారం నుంచే గొడవలతో సాగుతోంది. తాజాగా కిచెన్ అంశం మరోసారి రచ్చకు దారితీసింది. రెండోసారి కెప్టెన్ అయిన డీమాన్ పవన్, హౌస్‌లో దొంగతనం చేసిన వారిని జైల్లో వేస్తానంటూ ‘ఓవరాక్షన్’ చేయడంతో సంజన “దమ్ముంటే వేయ్” అంటూ ఎదురు తిరిగింది. ఆ తర్వాత, తనకు పోపు కావాలని ఫుడ్ మానిటర్ తనూజను అడగగా, ఆమె అంగీకరించింది. అయితే, కిచెన్ వద్దకు వెళ్లిన సంజన స్టవ్ ఆన్ చేసి పోపు అడగడంతో, కెప్టెన్ డీమాన్ పవన్ అడ్డుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాం కదా అంటూ పవన్ ప్రశ్నలు వేయగా, దివ్య కూడా సమయం లేదని అభ్యంతరం చెప్పింది. డీమన్, దివ్యల కంప్లైంట్‌తో తనూజ కూడా సీరియస్ అయ్యింది.

Read Also: Dasara 2025: జమ్మి చెట్టు – విజయ, శ్రేయస్సు ప్రతీక

చిన్న పోపు కోసం ఇంత గొడవ అవసరమా అని సంజన ప్రశ్నించగా, వెల్లుల్లి లేవంటూ డీమన్ నసిగాడు. దీంతో ఆగ్రహించిన సంజన “నాకు బ్రేక్‌ఫాస్ట్ వద్దు. పర్మిషన్ తీసుకున్నా కదా. తినడానికి బిక్ష వేస్తున్నారా?” అంటూ అరుస్తూ వెళ్లిపోయింది. పవన్ ఆమె వెనుక వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా, తర్వాత వచ్చిన తనూజ కూడా ఫుడ్ విషయంలో సంజనతో వాదించింది. భరణి ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. తర్వాత, డీమన్ పవన్ సంజనకు సారీ చెప్పాడు. అయితే, సంజన శాంతించలేదు. రీతూ, తనూజ, శ్రీజ, దివ్య అడిగితే నువ్వు చేసి ఉండేవాడివి. నేను కాబట్టి నువ్వు నో చెప్తున్నావ్” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇమ్యూనిటీ టాస్క్

ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టాడు. డీమన్ సంచాలక్‌గా వ్యవహరించగా, 12 మంది కంటెస్టెంట్లను(Contestants) ఆరు టీములుగా విభజించారు. మొదటి రౌండ్‌లో సుమన్ శెట్టి, దివ్య టీమ్ మాత్రమే మిగిలింది. రెండో రౌండ్ కోసం తనూజ, ఫ్లోరాను ఎంపిక చేశారు. ఈ నలుగురికి మరో టాస్క్ నిర్వహించగా, సుమన్ శెట్టి మరియు తనూజ ఇమ్యూనిటీని దక్కించుకుని ఈ వారం నామినేషన్స్ నుంచి సురక్షితమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/devotional/dasara-2025-jammi-tree-symbol-of-victory-and-prosperity/557169/

Bigg Boss Season 9 Bigg Boss Telugu Demon Pawan Kitchen Fight Sanjana Tanuja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.