📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: Bigg Boss-లేడీ సింగాలకు బలైన హరీష్

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిగ్ బాస్ సీజన్ 9లో రెండో వారం నామినేషన్స్ పూర్తి స్థాయిలో హడావుడిగా సాగాయి. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్‌లో రీతూ చౌదరి మరియు హరీష్ మధ్య జరిగిన వాగ్వాదం(Quarrel) హౌస్‌ను కుదిపేసింది. నామినేషన్స్ సమయంలో హరీష్‌ను టార్గెట్ చేస్తూ ఎక్కువ మంది హౌస్‌మేట్స్ ఫైర్ అయ్యారు.

రీతూ చౌదరి మొదటగా హరీష్‌ను నామినేట్ చేస్తూ, “మీరు గివ్ అప్ ఇవ్వడం నాకు నచ్చలేదు” అని వ్యాఖ్యానించింది. దీనికి హరీష్ కౌంటర్ ఇస్తూ “నేను నీకోసం రాలేదు, నాకు నచ్చిన వాళ్లు బయట ఉన్నారు” అని ఘాటుగా సమాధానమిచ్చాడు. ఈ సమయంలో రీతూ భావోద్వేగానికి లోనవ్వగా, “ఏడ్చి ఏదైనా ప్రూవ్ చేయాలనుకోవద్దు” అంటూ హరీష్ రియాక్ట్ అయ్యాడు.

శ్రీజ – హరీష్ మధ్య కొత్త వివాదం

రీతూ తర్వాత శ్రీజ కూడా హరీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజనకు సపోర్ట్ చేసిన విషయంపై, “గేమ్ అయిపోయాక మీరు నాతో మాట్లాడలేదు” అంటూ తన అసంతృప్తిని తెలిపింది. అంతేకాకుండా హరీష్ “ఇమ్మూ” గురించి రెడ్ ఫ్లవర్ అన్న వీడియో చూపించడంతో బాడీ షేమింగ్ వివాదం రేగింది. దీనిపై శ్రీజ గట్టిగా ప్రశ్నించగా, హరీష్ “ఇరిటేషన్, బాడీ షేమింగ్ తేడా తెలియకపోతే నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు” అని తేల్చాడు.

హౌస్‌మేట్స్ రియాక్షన్

హరీష్ మాట్లాడుతూ “ఇలాంటివాళ్లతో ఉండటం ఇష్టం లేదు” అని అన్నప్పుడు, శ్రీజ “అయితే వెళ్లిపోండి” అని కౌంటర్(Counter) ఇచ్చింది. దాంతో హరీష్ “బిగ్ బాస్ అడిగితేనే వెళ్తాను” అని రెచ్చిపోయాడు. ఈ వ్యవహారంలో తనూజ, రీతూ కూడా స్పందిస్తూ, “ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి” అంటూ హరీష్‌పై మండిపడ్డారు.

బిగ్ బాస్ 9 రెండో వారం నామినేషన్స్‌లో ఎవరి మధ్య పెద్ద గొడవ జరిగింది?
రీతూ చౌదరి మరియు హరీష్ మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది.

రీతూ హరీష్‌ను ఎందుకు నామినేట్ చేసింది?
హరీష్ గివ్ అప్ ఇచ్చిన తీరు తనకు నచ్చలేదని రీతూ చెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/gaza-war-will-continue-until-their-hostages-are-released-israel/international/548937/

Bigg Boss 9 Google News in Telugu Harish Bigg Boss Fight Latest News in Telugu Ritu Chowdhary Sreeja Bigg Boss Telugu Bigg Boss Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.