📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Bigg Boss 9: హౌస్ లోకి టాలీవుడ్ కమెడియన్?

Author Icon By Anusha
Updated: October 3, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  (Bigg Boss Season 9)  హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్ లో 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఇప్పటికే ముగ్గరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు, ఈ వారం మరొకరు కూడా హౌస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 9: నాలుగో వారం నామినేషన్ ఫలితాలు.. టాప్‌లో సంజన

బిగ్ బాస్ ఇచ్చే కొత్త గేమ్స్, టాస్కులు, ట్విస్టులు, కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు , ఊహించని ఎలిమినేషన్లు, మిడ్ వీక్ వైల్డ్ కార్ట్ ఎంట్రీలు.. మొత్తానికి గతం కంటే కొంచెం భిన్నంగా ఈ బిగ్ బాస్ సీజన్ సాగుతోంది. ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు.

కాగా గత వారం మధ్యలోనే దివ్య నికితా (Divya Nikita) వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి అడుగు పెట్టింది. ‘అగ్నిపరీక్ష’ షో సత్తా చాటిన ఆమె కామనర్స్ కోటాలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సామాన్యుల కేటగిరీలో ఇదే అగ్నిపరీక్ష షో నుంచి మరొకరు కూడా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశముంది.

 Bigg Boss 9

వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ విషయానికి వస్తే

ఇక సెలబ్రిటీ కోటాలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. సీరియల్ హీరోయిన్ సుహాసిని, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య (Ramya) దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కావ్యశ్రీ, అమర్ దీప్ కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నట్లు సమాచారం.

ఇందుకోసం బిగ్ బాస్ టీం ఇప్పటికే అతనిని సంప్రదించిందని సమాచారం.ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు ప్రభాస్ శీను (Prabhas Seenu). విక్రమార్కుడు, పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, ఊసరవెల్లి, గబ్బర్ సింగ్, సింగిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వందల సినిమాల్లో నటించాడు ప్రభాస్ శీను. కాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, శ్రీను ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.

ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచ్ మేట్స్‌గా కూడా ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమాల్లో హీరోగా బిజీ అయిన తర్వాత పర్సనల్ అసిస్టెంట్ గా ప్రభాస్ డేట్స్‌ను శ్రీనునే మేనేజ్ చేస్తున్నాడు. ఇటీవలే సింగిల్ సినిమాతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ప్రభాస్ శీను చేతిలో మరో రెండు, మూడు సినిమాలున్నాయి. మరి ఈ సినిమాలకు బ్రేక్ ఇచ్చి అతను బిగ్ బాస్ లోకి వస్తాడో? లేదో? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

bigg boss 9 latest updates bigg boss tasks and games Bigg Boss Telugu Season 9 bigg boss wild card entries Breaking News contestant eliminations latest news Telugu News Telugu reality show

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.