బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ఈసారి ప్రేక్షకులను పూర్తిగా అయోమయానికి గురి చేస్తోంది.ఇప్పుడు పరిస్థితి చూస్తే “జల్లింది జీలకర్ర.. మొలిచింది కొత్తమీరా” అన్నట్టుగా మారిపోయింది. ఎవరు లోపలున్నారు, ఎవరు బయట ఉన్నారు, ఎవరు రీ ఎంట్రీ ఇస్తున్నారు అన్నది ప్రేక్షకులకు అర్థం కాకుండా పోయింది.
Read Also: Bigg Boss Telugu 9:అయ్యో హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నది ఎవరు?
ఇక ఎలిమినేషన్స్, నామినేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రీ ఎంట్రీలు అన్నీ కలగలసి గందరగోళానికి దారితీశాయి. మొదట ఎలిమినేట్ అయిన వారినే తిరిగి హౌస్‌లోకి పంపించడం, వారితోనే మళ్లీ నామినేషన్స్ చేయించడం. ఇది ప్రేక్షకుల్లో అసహనానికి దారి తీస్తోంది. సెలబ్రిటీలతో ఒక క్లాస్ షో అవ్వాల్సిన బిగ్ బాస్ ఇప్పుడు “డ్రామా షో”గా మారిపోయిందని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
శ్రీజ, భరణి ఈ ఇద్దరిని మాత్రమే హౌస్ (Bigg Boss 9)లో ఉంచి.. వాళ్లలో ఒక్కరికి మాత్రమే పర్మినెంట్ హౌస్ మేట్‌గా ఉంచడానికి టాస్క్‌లు ఓటింగ్‌లు పెట్టారు. హౌస్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ అయితే.. ఈ ఇద్దరికి మాత్రమే ఈ బంపరాఫర్ ఎందుకో బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వకపోగా.. ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్న తాజా నిర్ణయం కూడా వివాదానాకి తావిస్తోంది.
మళ్లీ ఆమెని హౌస్‌లోకి తీసుకుని వచ్చి
ఆల్రెడీ ఒకసారి శ్రీజా దమ్ము (Sreeja Dammu) ని అన్యాయంగా హౌస్ నుంచి బయటకు పంపారనే వాదన ఉంది. ఇప్పుడు మళ్లీ ఆమెని హౌస్‌లోకి తీసుకుని వచ్చి భరణిని పర్మినెంట్ హౌస్ మేట్‌గా అవకాశం కల్పిస్తూ.. శ్రీజాని ఎలిమినేట్ చేయబోతున్నారు.
నిజానికి శ్రీజ-భరణిలకు ఓటింగ్ అంటే.. వార్ వన్ సైడ్ ఖచ్చితంగా శ్రీజాకే ఎక్కువ ఓట్లు వస్తాయని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ వార్ వన్ సైడ్ అయ్యింది.. అది శ్రీజాకి కాదు.. భరణికి అనేది ఓటింగ్‌లోని ట్విస్ట్. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

హౌస్ మేట్‌గా ఉంచాలని కోరుకుంటున్నారనే
ఎవర్ని పర్మినెంట్ హౌస్ మేట్‌గా ఉంచాలని కోరుకుంటున్నారనే దానిపై బిగ్ బాస్ ఓటింగ్ కూడా పెట్టారు. ఓటింగ్ అయితే పెట్టారు కానీ.. దానికి సరైన రెస్పాన్సే లేదు. అది కూడా ఓటింగ్ ఒక్కరోజు మాత్రమే.శ్రీజా, భరణిలకు ఓటింగ్ అంటే.. శ్రీజాకే ఎక్కువ వస్తాయి.
ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టి.. ఆమెకే ఓట్లు వస్తాయని అనుకున్నారంతా. కానీ వాస్తవంలోకి వెళ్తే.. శ్రీజా కంటే భరణి (Bharani) కి ఎక్కువ పాపులారిటీ ఉందనేది వాస్తవం. పోనీ ఆమె ఎలిమినేట్ అయిన తరువాతి వారంలో ఇలాంటి పోల్ పెడితే కాస్తో కూస్తూ ఓటింగ్ వచ్చేదేమో కానీ.. ఆమె ఎలిమినేట్ అయ్యి మూడు వారాలు అయిపోయింది కాబట్టి..
అదే ఈ వారంలో అతనికి కలిసి వచ్చింది
ఆమెని, ఆమె ఆటని అంతా మర్చిపోయారు. పైగా భరణికి ఎంత కాదనుకున్నా కూడా.. సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ ఉంది. అదే ఈ వారంలో అతనికి కలిసి వచ్చింది.పైగా భరణి సరిగా ఆడకపోవడం వల్లనో లేదంటే.. ఏదైనా వెధవ పని చేసో.. ఎలిమినేట్ కాలేదు. హెల్దీ బాడింగ్స్ పెట్టుకున్నాడనే కారణంతోనే ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ ఓటింగ్‌లో పాల్గొనేవాళ్లు సెపరేట్ క్యాటగిరీ ఉంటుంది. అందులో ఎక్కువ శాంతం సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు.తనూజ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మద్దతు భరణికి ఉండటం కూడా అతనికి ప్లస్ అయ్యింది. ఈ లెక్కలన్నీ పక్కనపెడితే.. ముఖ్యంగా బిగ్ బాస్ లెక్క వేరే ఉంటుంది.
ఎవర్నైతే హౌస్‌లో ఉంచాలని అనుకుంటారో.. వాళ్లనే ఉంచుతారు. అక్కర్లేదు అనుకున్న వాళ్లని ఎలిమినేట్ చేసి పంపిస్తారు. అప్పుడు శ్రీజాని ఎలిమినేట్ చేయడానికి.. మళ్లీ తీసుకుని రావడానికి.. ఇప్పుడు మళ్లీ పంపించడానికి.. భరణిని ఉంచడానికి.. ఆడియన్స్ లెక్కలకంటే కూడా బిగ్ బాస్ లెక్కలే ఆచరణలోకి వస్తాయి. కాబట్టి.. ఈరోజు భరణి బిగ్ బాస్ హౌస్‌లో ఉంటున్నారు.. శ్రీజా ఎలిమినేట్ అవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: