
బిగ్ బాస్ తెలుగు 9వ (Bigg Boss 9) సీజన్ 12వ వారం ముగింపు దశకు చేరుకుంది. ఓవైపు ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, మరోవైపు కెప్టెన్సీ కోసం హౌజ్‌మేట్స్ మధ్య జోరుగా పోరు సాగుతోంది.కెప్టెన్ పదవి కోసం ఇమ్మాన్యుయెల్, సంజనా, దివ్య, రీతూ, కళ్యాణ్, డీమాన్ పవన్ పోటీలో నిలిచారు.
Read Also: Bigg Boss 9: సీజన్-9 చివరి కెప్టెన్‌గా కళ్యాణ్
టాస్క్ ప్రారంభమైన వెంటనే హౌజ్‌మేట్స్ మధ్య పలు విభేదాలు చోటు చేసుకున్నాయి. సంజనా–రీతూ, రీతూ–దివ్య మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. తనను టాస్క్ నుంచి తప్పించిన రీతూకు సంజనా కౌంటర్ ఇస్తూ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు హౌజ్ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. సర్ఫ్ యాక్సిల్ ప్రమోషనల్ టాస్క్ జరిగింది. ఈ టాస్కుకు సంచాలక్ గా దివ్యను పెట్టగా.. అటు భరణి, సుమన్ ఒక టీం.. రీతూ, తనూజ ఒక టీం అయ్యారు. అయితే ఎప్పటిలాగే నేనే గెలవాలి.. నేను గెలిస్తేనే ఆట అవతలి వాళ్లు గెలిస్తే ఏడుపు అన్నట్లుగా ఉండే తనూజ.. ఇప్పుడు కూడా మరోసారి సీరియల్ నటిని బయటకు తీసింది.
టాస్కులో భరణి, సుమన్ టీం గెలిచారు. ఇంకేముంది తనూజ ఏడుపు స్టార్ట్ చేసింది. సీజన్ మొత్తం సంచాలక్ గా ఒక్కరికే ఇచ్చేయండి బిగ్ బాస్ (Bigg Boss 9) అంటూ దివ్య పై సీరియస్ అయ్యింది. దీంతో భరణి ఇచ్చిపడేశాడు.
దీంతో అసలు విషయాన్ని పక్కన పెట్టేసి
రూల్స్ నీకొక్కదానికే తెలిసినట్టు మాట్లాడకు.. ఊరికే లొడలొడా మాట్లాడకు అంటూ ఫైర్ అయ్యాడు భరణి. దీంతో అసలు విషయాన్ని పక్కన పెట్టేసి.. వాగొద్దు.. వాగుడు.. పిచ్చి మాటలు అనొద్దు అంటూ రెచ్చిపోయింది. సీజన్ మొత్తం ఒకర్నే పెట్టండి అనే మాటలు ఎందుకు ? దివ్య అడిగింది.
బిగ్ బాస్ నెక్ట్స్ నుంచి సంచాలక్ గా వేరే వాళ్లను పెట్టండి. నేను చూడలేకపోతున్నానంటా అంటూ దివ్య కౌంటరిచ్చింది. మొత్తానికి.. తాను గెలిస్తే ఒకే.. అవతలి వాళ్లు గెలిస్తే మాత్రం తనూజ మరోలా రియాక్ట్ అయిపోతుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: