हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: చికెన్ కోసం తనూజ సీక్రెట్స్ రివీల్ చేసిన రీతూ

Anusha
Latest News: Bigg Boss 9: చికెన్ కోసం తనూజ సీక్రెట్స్ రివీల్ చేసిన రీతూ

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈసారి హౌస్‌లోని వాతావరణం మరింత వేడెక్కింది. హరీష్, ప్రియ, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ వంటి ఆరుగురు కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఈ వారం ఇంటి బయటకు వెళ్లబోతున్నారు. మొదటి రెండు వారాల్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ మధ్య చిచ్చు పెట్టి హౌస్‌ను హంగామాగా మార్చిన బిగ్ బాస్, ఇప్పుడు హౌస్‌లోని సీక్రెట్లు బయటపెట్టించే కొత్త టాస్క్‌తో సభ్యులను పరీక్షిస్తున్నాడు.

ఈ వారం గేమ్ మోడ్ కొంచెం మారింది. హౌస్‌లోని సభ్యుల భావోద్వేగాలను టచ్ చేసే విధంగా టాస్క్‌లు డిజైన్ చేశారు. ఆ ఎమోషనల్ కంటెంట్‌ను ఉపయోగించి బిగ్ బాస్, కంటెస్టెంట్ల వ్యక్తిగత రహస్యాలను బయటకు తీయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన కంటెస్టెంట్ రీతూ (Ritu) నే. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో, తన స్టైల్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే రీతూ, ఈసారి కాస్త కఠినమైన సిట్యువేషన్‌లో పడింది.

“చికెన్ కోసం సీక్రెట్స్” – బిగ్‌బాస్ కఠిన ప్రశ్న

బిగ్ బాస్ ఆమెను కన్ఫెషన్ రూంకు పిలిచాడు. రీతూ అక్కడికి వెళ్ళగానే, టేబుల్ మీద ఒక క్లాత్ కప్పి ఉంచిన వస్తువు చూపించాడు. ఆ క్లాత్ తీసేయమని చెప్పగానే అందులో చికెన్ ఉండటం చూసి రీతూ ఆశ్చర్యపోయింది. ఆమెకు కన్నీళ్లు కూడా వచ్చాయి. బిగ్ బాస్ ఆమెను “చికెన్ తినొచ్చా?” అని అడగ్గా, “ఈ ఇంట్లో ఏది కూడా ఊరికే రాదు” అని గుర్తుచేసి, “చికెన్ కోసం మీరు హౌస్ సభ్యుల రహస్యాలను చెప్పడానికి సిద్ధమని మీరు అన్నట్లు విన్నాను. నిజంగానే సిద్ధమేనా?” అని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు రీతూ కొంత ఆలోచించి, “అవును” అంటూ తల ఊపింది. అందుకు బిగ్ బాస్ “అయితే ముందు ఎవరిని గురించి చెప్పదలచుకున్నావు?” అని అడిగాడు. వెంటనే రీతూ తనూజ గురించి ఒక సీక్రెట్ బయటపెట్టింది. ఈ విధంగా చికెన్ కోసం తనూజ (Tanuja) పై ఉన్న ఒక గోప్యమైన విషయాన్ని బిగ్ బాస్ ముందు రివీల్ చేసింది.

తనూజ గురించి మొదట రహస్యాలు వెల్లడి

తనూజకు ఒక పర్సన్ అంటే ఇష్టం, క్రష్ అని తనే చెప్పింది. అలాగే కళ్యాణ్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ లేనట్లు కనిపిస్తుంది. అది తెలిసిపోతుంది. కళ్యాణ్ దగ్గరుంటే తను కొంచెం పాజిటివ్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చికెన్ అంటే మీకు అంత ఇష్టం కాదనిపిస్తుంది అంటూ బిగ్ బాస్ అడిగాడు. చికెన్ (Chicken) అంటే నాకు పిచ్చి అని చెబుతుంది. ఇప్పుడు పవన్ గురించి చెప్పండి అని బిగ్ బాస్ అడగడంతో పవన్ సింగిల్ అని చెప్పాడు..

Bigg Boss 9
Bigg Boss 9

తను ఒక అమ్మాయిని లవ్ చేశానని అన్నాడు. లవ్ చేసిన అమ్మాయికి కరెక్ట్ గా ప్రపోజ్ కూడా చేయలేదు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయిందని చెప్పాడు. ఇంతవరకూ అతడు ఎవరినీ ప్రాపర్ గా లవ్ చేయలేదని చెప్పాడు..దీంతో ఇవి సీక్రెట్స్ కాదని బిగ్ బాస్ చెప్పడంతో సాయంత్రం వరకు టైమ్ కావాలని.. ఆ లోపు అందరి గురించి తెలుసుకోని వస్తానని చెప్పడంతో సరే అన్నాడు బిగ్ బాస్. ఇక బయటకు వెళ్లగానే రీతూతో ముచ్చట్లు స్టార్ట్ చేశాడు డీమాన్ పవన్.

ఇంటి సభ్యులంతా మీ పేరున్న ఫలాన్ని తీసుకోండి

ఇక తర్వాత గార్డెన్ ఏరియాలో ఆపిల్ చెట్టు (apple tree) ముందు నిల్చోమన్నాడు. ఆ చెట్టుకు ఉండే పళ్లు కష్టం, శ్రమ ఫలితంగా తీపిగా మారాయి. మరికొన్ని ఊహించని రుచితో ఆశ్చర్యపరుస్తాయి. ఈ రెండు వారాల ఆట చూశాక ఏ ఫలం ఎవరికి దక్కాలో నేను నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులంతా మీ పేరున్న ఫలాన్ని తీసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ టాస్కులో భాగంగా ఇంటి సభ్యులకు వచ్చిన సందేశాలను జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి కూడా పోరాడాల్సి వస్తుందని చెప్పాడు.

ముందుగా ఇమ్మాన్యుయేల్ బజర్ నొక్కడంతో అతడిని కన్ఫెషన్ రూంకు పిలిచి మూడు ఆప్షన్ ఇచ్చాడు. మీ నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. అది కావాలంటే బ్యాటరీలో 45 శాతం ఖర్చు చేయాలి.. రెండోది మీ అమ్మ దగ్గరి నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది. అది కావాలంటే 35 శాతం బ్యాటరీ తగ్గుతుంది. చివరగా ఫ్యామిలీ ఫోటో ఉంది. అది కావాలంటే 25 శాతం బ్యాటరీ ఖర్చు చేయాలని అడిగాడు బిగ్ బాస్. దీంతో కాస్త ఎమోషనల్ అవుతూ ఫ్యామిలీ ఫోటో సెలక్ట్ చేశాడు ఇమ్మాన్యుయేల్. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870