బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) మరో నాలుగు వారాల్లో పూర్తి కానుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున వేదిక మీదకు అక్కినేని నాగ చైతన్యను తీసుకురావడంతో ఎపిసోడ్ మరింత అట్రాక్షన్‌గా మారింది. హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్, ఫన్నీ మాటలు, చివరిగా ఎలిమినేషన్… మొత్తం ఎపిసోడ్ అభిమానులను ఆకట్టుకుంది.
Read Also: Bigg Boss 9: ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్
టైటిల్ విన్నర్ రేసులో తనూజ దూసుకుపోతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డీమాన్, రీతూ ఉండగా.. తన ఆట తీరు, ప్రవర్తనతో నెగిటివిటీని మూటగట్టుకుంటుంది దివ్య నిఖిత. నిజానికి ఈ వారం ఆమెకు తక్కువ ఓటింగ్ రాగా.. నిఖిల్, గౌరవ్ ఇద్దరినీ ఎలిమినేట్ చేశారు.
అయితే స్టేజ్‌పైకి నాగ చైతన్యకి నాగార్జున ప్రేమగా స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ‘శివ’ రీ-రిలీజ్ గురించి మాట్లాడుకున్నారు. అనంతరం చైతూ తన రేసింగ్ టీం Hyderabad Blackbirds గురించి వివరించారు. దీనిపై నాగార్జున “నాకు చెప్పకుండానే ఓనర్ అయిపోయావా?” అని సరదాగా సెటైర్ వేయగా, చైతూ కూడా నవ్వుతూ స్పందించాడు.

బయటికి వచ్చేస్తే చైతూతో బైక్ రైడ్‌కు పంపిస్తా
ఇక నాగార్జున హౌస్‌మేట్స్‌తో యానిమల్ పేర్స్ గేమ్ ఆడించారు. అందరూ సరదాగా ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. చైతూ హౌస్‌మేట్స్‌తో ఇంటరాక్షన్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్‌లో ఎక్కువ దృష్టి ఆకర్షించింది రీతూ చౌదరి ప్రవర్తన. చైతూని చూసిన వెంటనే పొగడ్తల మోత మోగించింది.
చైతూ కాళ్లు శిల్పం లా ఉంటాయి, ఆయన అభిమానిని… ఆయనని చూసి ఫిదా అయిపోతాను అని ఫ్లర్టింగ్ చేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అయితే దానికి నాగార్జున స్పందిస్తూ “ఆ శిల్పాన్ని చెక్కింది నేనే” అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. అంతే కాకుండా నాగార్జున రీతూకి “ఇప్పుడు బయటికి వచ్చేస్తే చైతూతో బైక్ రైడ్‌కు పంపిస్తా” అని ఆఫర్ ఇచ్చాడు.దానికి రీతూ “నేను రెడీ!” అని అనడంతో హౌజ్ (Bigg Boss 9) మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: