Latest News: Bigg Boss 9: రీతూ–సంజన వివాదం పై నాగార్జున ఆగ్రహం

Read Time:  1 min
Latest News: Bigg Boss 9: రీతూ–సంజన వివాదం పై నాగార్జున ఆగ్రహం
FONT SIZE
GET APP

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9).. 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ గురించి చెప్పక్కర్లేదు. డీమాన్, కళ్యాణ్ మధ్య గొడవ.. రీతూపై సంజన మాటలు సైతం ఈ వారం హాట్ టాపిక్ అయ్యాయి. సంజన మాటలు రీతూ క్యారెక్టర్ ను కించపరిచేలా ఉన్నాయంటూ హౌస్మేట్స్ సైతం సీరియస్ అయ్యారు. అయినప్పటికీ సంజన ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వివాదంపై నాగార్జున ఎలా స్పందిస్తారు.. ? అనేది తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు.

Bigg Boss 9: శనివారం ఎపిసోడ్ ప్రోమో విడదల?

గత కొన్ని రోజులుగా రీతూ, పవన్ రాత్రివేళల్లో కూర్చుని మాట్లాడుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని సంజన చేసిన వ్యాఖ్యలు ఇంట్లో పెద్ద వివాదంగా మారాయి. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో కూడా ఇదే సమస్య కొనసాగడంతో ఇంటి వాతావరణం మరింత టెన్షన్‌గా మారింది. శనివారం నాటి ఎపిసోడ్ లో, నాగార్జున .. సంజన చేసిన ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంట్లో అనేక కెమెరాలు ఉన్నాయనీ, ఏది దాచిపెట్టలేదనీ, అయినా రీతూ–పవన్‌పై సంజన చేసిన వ్యాఖ్యలు క్యారెక్టర్ అసాసినేషన్‌కు దారితీసేలా ఉన్నాయని అన్నారు.  సంజన మాత్రం నేను చూసిందే చెప్పానని, ఏం తప్పు చేయలేదని పేర్కొంది. నీకు ఇబ్బందిగా ఉంటే హౌస్ గేట్స్ ఓపెన్ చేస్తాను, వెళ్లిపోవచ్చు” అని నాగార్జున కఠినంగా హెచ్చరించగా, సంజన నిజంగానే వెళ్లిపోతానని ప్రకటించింది.

Bigg Boss 9: Nagarjuna angry over Ritu-Sanjana controversy
Bigg Boss 9: Nagarjuna angry over Ritu-Sanjana controversy

ఇలా ఒకే ఒక్క ఎపిసోడ్ ప్రేక్షకులను

పరిస్థితి మరింత సీరియస్ అవడంతో నాగార్జున నిర్ణయాన్ని భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజపై వదిలేశారు. ముగ్గురూ కలిసి సంజన.. రీతూ, బిగ్ బాస్, ప్రేక్షకులను క్షమాపణ కోరితే హౌస్‌(Bigg Boss 9)లో ఉండవచ్చని తీర్పు చెప్పారు. సంజన మొదట క్షమాపణ చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు. “మనసు చంపుకుని నేను ఇక్కడ ఉండలేను” అని చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. చివరకు నాగార్జున రిక్వెస్ట్ చేయడంతోనే సంజన సాఫ్ట్ అయింది.

చివరికి సంజన ప్రేక్షకులకు, రీతూకి క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. కానీ అక్కడితో నాగార్జున క్లాస్ ఆపలేదు. తూ తరచూ పవన్ తరుపున మాట్లాడటం తప్పేనని, “నువ్వు అతడికి లాయర్‌వా?” అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.కెప్టెన్సీ టాస్క్ సమయంలో కుర్చీ విసిరిన కళ్యాణ్ మీద కూడా నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మొత్తానికి ఈ ఎపిసోడ్ రీతూ–సంజన మధ్య మాటల యుద్ధం, సంజన వెళ్లిపోతాననే డ్రామా, చివరకు క్షమాపణతో ముగింపు .. ఇలా ఒకే ఒక్క ఎపిసోడ్ ప్రేక్షకులను మైండ్‌గేమ్‌లతో అలరించింది. బిగ్ బాస్ తెలుగు 9లో రాబోయే రోజులు ఇంకా ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.