Latest News: Bigg Boss 9: పదకొండవ వారం ఫ్యామిలీ వీక్

Read Time:  1 min
Latest News: Bigg Boss 9: పదకొండవ వారం ఫ్యామిలీ వీక్
FONT SIZE
GET APP

బిగ్ బాస్ 9 (Bigg Boss 9) సీజన్‌లో పదకొండో వారం స్పెషల్‌గా ఉంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ వీక్. హౌస్ మేట్స్ తమ కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు కంటెస్టెంట్స్. ఇప్పటికే సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, దివ్య కుటుంబాలు ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా భరణి కూతురు హౌస్ లో (Bigg Boss 9) కి వచ్చింది. తన తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. అటు చాలా రోజుల తర్వాత కూతురిని చూడగానే భరణి సైతం ఎమోషనల్ అయ్యారు. తన తండ్రికి తగిలిన గాయాలను చూసి అల్లాడిపోయింది. తాజాగా విడుదలైన ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది.

Read Also: Bigg Boss 9: హౌస్‌లో ఫ్యామిలీ వారం

భరణి కూతురు హౌస్‌లోకి

తాజాగా విడుదలైన ప్రోమోలో సర్ ప్రైజ్ అంటూ తన తండ్రి ఎదురుగా వచ్చింది. భరణికి ఇంత పెద్ద కూతురు ఉందా ? అంటూ హౌస్మేట్స్ తోపాటు ఇటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రావడంతోనే తండ్రిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే తండ్రికి తగిలిన గాయాలను చూస్తూ అల్లాడిపోయింది.

Bigg Boss 9: Eleventh week is Family Week
Bigg Boss 9: Eleventh week is Family Week

నీ గురించే మా బెంగ అంతా.. నీ హెల్త్ జాగ్రత్త డాడీ.. అలా నిన్ను చూడలేకపోతున్నాం అంటూ తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. నిన్ను చూసి మాకు చాలా గర్వంగా ఉంది.. మీ కూతురిగా పుట్టడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది.తర్వాత భరణి బాండింగ్స్ గురించి క్లారిటీ ఇచ్చింది.

”అందరూ మిమ్మల్ని బాండింగ్స్ అని అంటున్నారు.. కానీ అది మీరు పెరిగిన వాతావరణం.. అందుకే అందర్నీ దగ్గరకు తీసుకుంటున్నారు. మీరు వాళ్లను బాగా చూసుకుంటున్నారని నాకు తెలుసు.. నిన్ను ఈ వారం కెప్టెన్ గా చూడాలి డాడ్” అని చెప్పింది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య బాండింగ్ ఇప్పుడు జనాలను ఆకట్టుకుంటుంది. అలాగే భరణి బాండింగ్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.