Latest News:  Bigg Boss 9: అనారోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వచ్చేసిన అయేషా..

Read Time:  1 min
Bigg Boss 9
Bigg Boss 9
FONT SIZE
GET APP

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆయేషా కొద్ది రోజుల్లోనే హౌస్ లో హంగామా క్రియేట్ చేసింది. మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, రూమ్ షేర్ టాస్క్ లో, నామినేషన్స్ సమయంలో చేసిన సంచలన కామెంట్స్ తో ఒక్కసారిగా హౌస్ లో ప్రతి ఒక్కరి దృష్టి తనపైకి మళ్లించింది.కొద్దిసేపట్లోనే ఆమె ప్రవర్తన, ధైర్యంగా మాట్లాడే తీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

Bigg Boss Telugu 9:రీఎంట్రీతో దుమ్ము రేపుతున్న శ్రీజ

అంతకు ముందు తమిళ బిగ్ బాస్ (Tamil Bigg Boss) షోలో 9 వారాలు ఉండి వివాదాస్పద కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, హోస్టును సైతం ఎదురించడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమె ఆట తీరు, మాట తీరుతో విసుగుపోయిన జనాలు తమిళ బిగ్ బాస్ షో నుంచి 9వ వారంలోనే బయటకు పంపించారు. ఇక ఇప్పుడు తెలుగు బిగ్‏బాస్ షో (Bigg Boss 9)లోకి రాగానే.. తన నోటికి పనిచెప్పింది.

Bigg Boss 9
Bigg Boss 9

మొదటి వారంలో తనూజ, రీతూలను అటాక్ చేసిన ఆయేషా (Ayesha) .. ఆ తర్వాత వారంలో రీతూపై ఏంటే.. అంటూ నోరు పారేసుకుంది. నామినేషన్స్, టాస్కుల సమయంలో గట్టి గట్టిగా అరుస్తూ.. ఏడుస్తూ నానా హంగామా చేసింది.అయితే ఇప్పుడు ఈ అమ్మడు అర్థాంతరంగా హౌస్ ను విడాల్సి వచ్చింది. బిగ్‏బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాతి రోజు నుంచి ఆయేషాకు హెల్త్ డిస్ట్రబ్ అ్యయింది.

ఫీవర్ తోపాటు ఒళ్లు నొప్పులు

ఫీవర్ తోపాటు ఒళ్లు నొప్పులు కూడా ఉండడంతో మెడికల్ టెస్టులు చేయగా.. టైఫాయిడ్ తోపాటు డెంగ్యూ సైతం పాజిటివ్ అని వచ్చింది. ఇదే విషయాన్ని నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు. డాక్టర్ డెంగ్యూ అని చెప్పడంతో తన బెడ్ పై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది ఆయేషా. దీంతో ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశాడు నిఖిల్. ఆ తర్వాత హౌస్ లో వాళ్లంతా వచ్చి ఓదార్చారు.

ఆ తర్వాత రాము రాథోడ్ దగ్గర కూర్చుని నాకు జీవితంలో ఏదీ అంత ఈజీగా రాలేదు. బిగ్‏బాస్ సెకండ్ ఛాన్స్ ఎవరికీ రాదు. నాకు వచ్చింది. కానీ నా లైఫ్ లో ఏది ఎక్కువగా ప్రేమిస్తానో అది నాతో ఉండదు అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత కన్ఫెషన్ రూంకు ఆయేషాను పిలిచిన బిగ్‏బాస్.. ఆమె హౌస్మేట్స్ ఆరోగ్యం కోసం తనను హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు చెప్పాడు.

దీంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆయేషా. ఇక వెళ్తూ వెళ్తూ తనూజకు జాగ్రత్తలు చెప్పింది. మళ్లీ ఫేక్ దాంట్లో పడొద్దు.. ఇదొక్కటే చెప్తున్నాను అంటూ తనూజకు జాగ్రత్తలు, సలహాలు చెబుతూ వెళ్లిపోయింది. మొత్తానికి ఫైర్ బ్రాండ్ లా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆయేషా.. హెల్త్ డిస్ట్రబ్ కావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.