हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ కోసం ఏర్పాట్లు ప్రారంభం

Sharanya
Bigg Boss: బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ కోసం ఏర్పాట్లు ప్రారంభం

తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్ బాస్ (Bigg Boss) ఒకటి. గత ఎనిమిది సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో, ఇప్పుడు తొమ్మిదవ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈసారి కూడా స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ రియాలిటీ గేమ్ షోకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

కొత్త సీజన్‌పై భారీ అంచనాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో, దీంతో ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా, షో రేటింగ్‌ను అమాంతం పెంచేలా నిర్వాహకులు పక్కా ప్రణాళికతో ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా, ఈసారి మరింత క్రేజీ కంటెస్టెంట్లను, ముఖ్యంగా కాంట్రవర్సీలకు దగ్గరగా ఉండే సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సారి కాంట్రవర్సీ, కంటెంట్ ఫుల్!

నిర్వాహకులు ఈ సారి పలు రంగాల నుంచి గుర్తింపు పొందిన, పాపులర్ అయిన కాంట్రవర్షియల్ సెలబ్రిటీలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనబోయే కొందరు సంభావ్య కంటెస్టెంట్ల పేర్లు అంటూ ఓ జాబితా, ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ లీకైన జాబితాలో బుల్లితెర నటీనటులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పాటు కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ వార్త తెలుగు వినోద పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

లీకైన కంటెస్టెంట్ లిస్ట్ – సోషల్ మీడియాలో హల్చల్

ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ 9 సీజన్‌లో పాల్గొనబోతున్న సంభావ్య కంటెస్టెంట్ల లిస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. దీనిని బట్టి పాల్గొనబోతున్నట్లు వినిపిస్తున్న పేర్లలో- ‘మై విలేజ్ షో’ ద్వారా గుర్తింపు పొందిన అనిల్ గీల, సీరియల్ నటి కావ్య, నటి రీతూ చౌదరి, ప్రదీప్ అనే పేరుతో ఒకరు, నటుడు శివ కుమార్, ‘బ్రహ్మముడి’ సీరియల్ ఫేమ్ దీపిక, ‘జబర్దస్త్’ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సీరియల్ నటుడు సీతాకాంత్, నటి ప్రియాంక జైన్ ప్రియుడిగా చెబుతున్న శివ కుమార్, యూట్యూబర్ అలేఖ్య (చిట్టి పికిల్స్), నటుడు అమర్ తేజ్ భార్య తేజస్విని గౌడ, సీరియల్ నటి దేబ్‌జాని, ‘కేరింత’ సినిమా హీరో సుమంత్ అశ్విన్, అలాగే సీరియల్ నటులు హారిక, ఏక్‌నాథ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.

అధికారిక సమాచారం మాత్రం లేదు

ఇప్పటివరకు బిగ్ బాస్ అధికారికంగా ఈ జాబితాలోని ఎవరి పేరునూ ధృవీకరించలేదు. కానీ, ఈ పేర్ల చుట్టూ సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారన్నది అధికారికంగా తెలిసే వరకు ప్రేక్షకులకు ఉత్కంఠ తప్పదు. ఏది ఏమైనప్పటికీ, బిగ్ బాస్ తొమ్మిదో సీజన్‌పై మాత్రం ప్రేక్షకుల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read also: Manchu Vishnu: కన్నప్ప ఈవెంట్‌లో ప్రభాస్‌పై విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870