📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Bigg Boss 9: సామాన్యులకు కూడా బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొనే అవకాశం

Author Icon By Sharanya
Updated: June 29, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్‘ (Bigg Boss 9) మళ్లీ కొత్త ఉత్సాహంతో, కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఎనిమిది విజయవంతమైన సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, తొమ్మిదో సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంది. గత సీజన్ల మాదిరిగానే కింగ్ నాగార్జున ఈ సీజన్‌కు వ్యాఖ్యాతగా కొనసాగనుండటమే కాకుండా, ఈసారి సామాన్యులు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టే అవకాశం కల్పించబడుతున్నది అన్న వార్త షోపై అంచనాలను రెట్టింపు చేసింది.

ఈసారి “రియాలిటీ” నిజంగానే రియలైజ్ అవుతోంది

బిగ్‌బాస్ సాధారణంగా సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే ఓ ప్రత్యేక వేదికగా గుర్తింపు పొందింది. కింగ్ నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ సీజన్‌కు ‘చదరంగం కాదు.. ఈసారి రణరంగం’ అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ముఖ్యంగా ఈసారి కేవలం సెలబ్రిటీలకే కాకుండా, సామాన్య ప్రజలకు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించి షోపై అంచనాలను పెంచారు.

నాగార్జున ప్రోమోతో సమాజానికి సందేశం

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున ఈ కీలక ప్రకటన చేశారు. ‘‘ఇన్నాళ్లుగా మీరు బిగ్‌బాస్ షోను ఎంతో ఆదరించారు. ఇంత ప్రేమను పంచిన మీకు బదులుగా ఎలాంటి కానుక ఇవ్వాలి? మీరు ఎంతగానో ఇష్టపడే బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశమే మీకు మేమిచ్చే రిటర్న్ గిఫ్ట్. ఈసారి హౌస్‌లోకి సెలబ్రిటీలతో పాటు మీలో ఒకరికి కూడా చోటు ఉంటుంది. బిగ్‌బాస్ 9 తలుపులు మీకోసం తెరిచే ఉన్నాయి, వచ్చేయండి’’ అంటూ సామాన్యులను షోలోకి ఆహ్వానించారు.

ఎలా అప్లై చేయాలి?

ఈ ఛాన్స్‌ను ఉపయోగించుకోవాలనుకునే అభ్యర్థులు వారు bb9.jiostar.com వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకుని, బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో వివరిస్తూ ఒక వీడియోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని జియో హాట్‌స్టార్ నిర్వాహకులు తెలిపారు. నిబంధనల మేరకు ఎంపికైన వారికి హౌస్‌మేట్‌గా మారే అవకాశం లభిస్తుంది.

వదంతులకు ముగింపు!

కొన్ని రోజులుగా, ఈ సీజన్‌కు వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈసారి నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వస్తారంటూ ఊహాగానాలు వ్యాపించాయి. అయితే, తాజా ప్రోమోలో నాగార్జునే కనిపించి, కొత్త సీజన్‌ను ప్రకటించడంతో ఆ వదంతులకు తెరపడినట్టయింది. ‘ఆటలో అలుపు వచ్చినంత తేలిగ్గా గెలుపు దక్కదు. గెలవాలంటే యుద్ధం చేస్తే చాలదు, ప్రభంజనం సృష్టించాలి’ అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్‌లు షోపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

కంటెస్టెంట్ల ఎంపిక వేగంగా కొనసాగుతోంది

ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ, టీవీ నటులతో పాటు సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన ఇన్‌ఫ్లూయెన్సర్లను నిర్వాహకులు సంప్రదించినట్టు తెలుస్తోంది. ఒప్పందాలు, ఇతర వడపోతల ప్రక్రియలు పూర్తయ్యాక ఫైనల్ కంటెస్టెంట్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గత సీజన్లలో ఒకటి, రెండుసార్లు సామాన్యులకు అవకాశం ఇచ్చినా, ఈసారి అధికారికంగా ప్రకటన విడుదల చేసి ఆహ్వానించడంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Read also: AIR (All India Rankers): ‘ఏఐఆర్‌’ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

#BB9Updates #BiggBoss2025 #BiggBoss9 #BiggBossHouse #BiggBossTelugu #CommonManChance #Nagarjuna #RanarangamNotChadarangam BB9Auditions Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.