📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bigg Boss 9: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డీమన్ పవన్ (Deman Pawan) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా నోటి క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన తండ్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బిగ్ బాస్ షోలో పవన్ తన తండ్రి అనారోగ్యం గురించి ఎమోషనల్‌గా ప్రస్తావించారు. తన తండ్రికి క్యాన్సర్ అని, ఆయన కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడి ప్రేక్షకులను కదిలించారు. తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న పవన్‌కు ఇప్పుడు ఆయన లేరనే వార్త తీరని వేదనను మిగిల్చింది.

Read Also: Jr. NTR: ‘డ్రాగన్’ సినిమా విడుదల వాయిదా?

Bigg Boss 9: Bigg Boss 9 contestant Demon Pawan’s father passes away

డీమన్ పవన్ బిగ్ బాస్ సీజన్ 9లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. హౌస్‌లో ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటూ, తన వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించుకున్న ఆయన, ఫైనల్ రేసులో టాప్ 3 లో నిలిచారు. తన తండ్రిని చూసుకోవాలనే తపనతో హౌస్ నుండి బయటకు వచ్చిన పవన్‌కు ఈ వార్త కోలుకోలేని దెబ్బ. పవన్ తండ్రి మరణవార్త విన్న నెటిజన్లు, బిగ్ బాస్ తోటి కంటెస్టెంట్లు మరియు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. “స్టే స్ట్రాంగ్ పవన్” అంటూ ఆయనకు ధైర్యాన్ని చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bigg Boss Telugu BiggBoss9 cancer Deman Pawan Pawan Father Demise

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.