దీక్షిత్ శెట్టి (Dixit Shetty) కథానాయకుడిగా కన్నడలో రూపొందిన సినిమా (Bank Of Bhagyalakshmi) బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. అభిషేక్ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రితం ఏడాది నవంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 12వ తేదీ నుంచి (Amazon Prime) లో స్ట్రీమింగ్ అవుతోంది, కన్నడతో పాటు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
Read also: Prabhas: ‘స్పిరిట్’ మూవీ విడుదల తేదీ ఫిక్స్
కథ
(Bank Of Bhagyalakshmi) కనక (దీక్షిత్ శెట్టి) తన స్నేహతులతో కలిసి చిన్నప్పుడు ఒక దొంగతనం చేస్తాడు. అప్పుడే అతనిపై ‘దొంగ’ అనే ముద్రపడుతుంది. ఎలాగో దొంగ అనే కదా అంటున్నారని చెప్పి, అలా దొంగతనాలు చేయడం కంటిన్యూ చేస్తూ వెళతాడు. చిన్నాచితకా దొంగతనాలు ఎన్నాళ్లని చేస్తాం ఒక పెద్ద దోపిడీ చేసి, లైఫ్ లో సెటిలై పోవడమే బెటర్ అనే నిర్ణయానికి వస్తాడు. అందుకు మిగతా స్నేహితులు కూడా సై అంటారు.
అది ఎలక్షన్స్ సమయం కావడం వలన పట్నాల్లోని బ్యాంకులలో రిస్క్ ఎక్కువగా ఉండటం వలన విలేజ్ లలో ఉండే బ్యాంకులోని డబ్బును కాజేయాలని ప్లాన్ చేస్తారు. భాగ్యలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ను ఎంచుకుంటారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఐదుగురు స్నేహితులు బ్యాంకులోకి జొరబడతారు. బ్యాంకు సిబ్బందినీ కష్టమర్లను భయపెడతారు. కొన్ని లక్షల క్యాష్ మాత్రమే ఉండటంతో నిరాశ చెందుతారు.
అయితే ఆ తరువాతనే వారు అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక సీక్రెట్ రూమ్ ను చూస్తారు. వందల కోట్ల రూపాయలు అక్కడ ఉండటం చూసి షాక్ అవుతారు. చిన్న విలేజ్ లోని ఒక బ్యాంకులో వందల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది వాళ్లకి అర్థం కాదు. ఆ డబ్బు ఎక్కడిది? అది తెలుసుకున్న కనక టీమ్ ఏం చేస్తుంది? ఆ దోపిడీతో లైఫ్ లో సెటిలైపోవాలనే వాళ్ల కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
పనితీరు
దర్శకుడు ఈ కథను సీరియస్ గా చెప్పవలసిన చోట సీరియస్ గా చెప్పవలసింది. ఒక వైపున పోలీసులు రాజకీయనాయకులు మరో వైపున మీడియా హడావిడి చేస్తుంటే, మరో వైపున బ్యాంకులో దొంగలు కామెడీ చేస్తుంటారు. ఏ ట్రాక్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. ఫొటోగ్రఫీ నేపథ్య సంగీతం ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. నటీనటుల నటన గురించి మాట్లాడుకునే స్థాయిలో వాళ్ల పాత్రలు కనిపించవు. బలమైన కంటెంట్ లేకుండా నాలుగు గోడల మధ్య నడిచిన మరో కథగా మాత్రమే ఇది కనిపిస్తుంది.
ముగింపు
ఇది విలేజ్ నేపథ్యంలో ఓ బ్యాంక్ చుట్టూ తిరిగే కథ. ఒక ట్విస్ట్ ను పట్టుకుని .. కామెడీని నమ్ముకుని ముందుకు వెళ్లారు. కామెడీ పేలకపోవడంతో .. పేలవమైన సన్నివేశాలతో అసహనాన్ని కలిగించే సినిమాగానే ఇది మిగిలిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: