📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Bandla Ganesh: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ నుంచి ప్రత్యేక గీతం విడుదల

Author Icon By Saritha
Updated: February 2, 2026 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
A special song has been released from the movie ‘Sampradayini Suppini Suddapusa’.

సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’  ఈ సినిమాలో నటుడు శివాజీ, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్‌’లో ఈ నెల‌ 12 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం, (Bandla Ganesh) తాజాగా సినిమాలోని ‘పాయా పాయా’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఈ పాటలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ తన డ్యాన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Read Also: Ram Charan: స్పెషల్‌ ఫొటో పంచుకున్న నటుడు

ఫుడ్ ఫెస్టివల్ నేపథ్యంలో కలర్‌ఫుల్‌గా చిత్రీకరించిన ఈ పాటలో బండ్ల గణేశ్‌ ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఆయనతో పాటు కమెడియన్ అలీ, బబ్లూ, భోలే శావలి కూడా సందడి చేశారు. ఈ పాటకు విశేషం ఏమిటంటే, పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేశ్‌కు ఉన్న అభిమానాన్ని ఇందులో హైలైట్ చేశారు. గతంలో వైరల్ అయిన తన “ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా” అనే డైలాగ్‌ను ఈ పాటలో రీమిక్స్ చేశారు. పవన్ మేనరిజాన్ని అనుకరిస్తూ బండ్ల వేసిన స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

పవన్ కల్యాణ్ అన్న కూడా హైదరాబాద్ సే పాయా మంగాయా హిట్ల మీద హిట్లతో పవర్ స్టార్ బన్ గయా” వంటి సాహిత్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ పాటలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు సీఎం చంద్రబాబును కూడా ప్రస్తావిస్తూ బండ్ల గణేశ్‌ స్టెప్పులు వేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Bandla Ganesh ETV Win Latest News in Telugu OTT Release Pawan Kalyan Paya Paya Song Sampradayini Suppini Suddapusani telugu movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.