📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Bandla Ganesh: “చంద్రుడి” కోసం సంకల్పం.. మొదలైన “గణేశుడి” ప్రయాణం..

Author Icon By Pooja
Updated: January 19, 2026 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఘనంగా మొదలైన సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్పయాత్ర..

చంద్రబాబు కోసం తిరుపతికి పాదయాత్ర చేస్తున్న గణేష్..

హాజరైన సినీ నటుడు శివాజీ, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు

శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

షాద్ నగర్ టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల అభినందనలు – సంఘీభావం
జన సమూహం మధ్య మొదలైన సంకల్ప యాత్ర ఆనాడు పురాణాల్లో గణేషుడు చంద్రుడిని శపించాడు.. కానీ ఈనాటి గణేషుడు ఆ చంద్రుడిని అమితంగా ప్రేమించాడు.. ఆ చంద్రుడు ఎవరో కాదు సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. గణేశుడు ఎవరు అంటారా.. సినీ నిర్మాతగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పాత్రలు పోషిస్తున్న బండ్ల గణేష్.(BandlaGanesh) గతంలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు విపరీతంగా చలించిన ఆయన చంద్రబాబు క్షేమంగా బయటికి వస్తే తన గడప నుంచి వెంకన్న గడప దాకా వస్తానని ఆ ఏడుకొండలవాడికి మొక్కుకున్నాడు.. ఆ క్రమంలోనే సంకల్ప యాత్ర పేరిట పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తన సొంత పరమేశ్వర థియేటర్ నుంచి పాదయాత్రను ప్రారంభించాడు.

Read Also: Magha masam: ఆధ్యాత్మికంగా విశిష్టమైన శుభ కాలం

షాద్ నగర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు సినీ నటుడు శివాజీ, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎండి ఖాజాపాషా (కేపి), జిల్లా గౌరవ అధ్యక్షులు గట్టుపల్లి మోహన్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్ తదితర స్థానిక జర్నలిస్టులు ఆయనను కలిసి అభినందనలు అందజేశారు. భారీ ఎత్తున హాజరైన అభిమానుల మధ్య ఆయన పాదయాత్ర విజయవంతంగా మొదలైంది.

ఇది రాజకీయ యాత్ర కాదు..బండ్ల గణేష్

తాను చేస్తున్నది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (BandlaGanesh )స్పష్టతనిచ్చారు. సంకల్ప యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను మొక్కుకున్న తీరుగా తన గడప నుంచి ఆయన గడపకు పాదయాత్ర చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఒకరోజు తెల్లవారుజామున లేవగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్న వార్త విని చలించిపోయానని, ఆయనను ఎప్పుడూ విడుదల చేస్తారని ఎదురు చూశానని ఆయన అన్నారు. 42 రోజులు గడుస్తున్న చంద్రబాబు నాయుడు బయటికి రాకపోవడం చూసి తాను చాలా భయపడ్డానని, ఆయన క్షేమంగా వస్తారా లేదా అని అనుమానించానని అన్నారు.

ఈ క్రమంలోనే ఆయన అరెస్టును దారుణంగా పరిగణించి ఉద్యమం మొదలు పెట్టానని, రోజు ఢిల్లీకి వెళ్లి కూర్చునేవాడినని గుర్తు చేశారు. తన మిత్రుడు నటుడు శివాజీతో కూడా ఎప్పుడూ ఇదే అంశంపై చర్చించేవాడినని వెల్లడించారు. మనలాంటి వాళ్ళ ఎందరికో బతుకిచ్చిన చంద్రబాబును విడుదల చేసేదాకా పోరాటం ఆపకూడదని ఒక జట్టును తయారుచేసి పోరాటాన్ని మొదలుపెట్టామని అన్నారు. చంద్రబాబు బయటికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడో నని భయపడ్డామని, కానీ జూలు విడిచిన సింహంలా, తెలుగువారి గర్వంలా, తెలుగువారి తేజంలా ఆయన బయటికి రావడం చూసి చాలా సంతోషపడ్డామని ఆయన అన్నారు. తాను సినీ నటుడిని కావాలన్న సంకల్పంతో వెళ్లినప్పుడు మొదటిసారిగా చిరంజీవిని చూశానని ప్రస్తుతం ఆయన సినిమా ఆడుతున్న సమయంలోనే ఈ యాత్ర చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తన యాత్రకు సహకరిస్తూ తన వెన్నంటే నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu SankalpaYatra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.