📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News:Bandi Saroj: ‘అఖండ 2’ నిర్మాతలపై బండి సరోజ్ ఫైర్

Author Icon By Saritha
Updated: December 9, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2: తాండవం’ (‘Akhanda-2’) సినిమా లో, సంయుక్త హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అఖండ’ మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. అయితే కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Bandi Saroj Bandi Saroj fires on the producers of ‘Akhanda 2’

బండి సరోజ్ కుమార్ అఖండ 2 రిలీజ్ డేట్‌పై మండిపడ్డారు

ఈ పరిస్థితులపై నటుడు, దర్శకుడు బండి సరోజ్ కుమార్ (Bandi Saroj) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ వ్యవహారం బాధ్యతారాహిత్యంగా ఉందంటూ ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఏదైనా ఒకటి స్పష్టంగా చెబితే, 12న విడుదల కావాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులైనా మిగులుతాయి. అటు అభిమానులను, ఇటు సినిమా ఇండస్ట్రీని, మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను అందరినీ నిద్రలేకుండా చేసి ఏం సాధిస్తున్నారు? చెడ్డ పేరు తప్ప మరొకటి కాదు. బాధ్యత ఉండాలి” అంటూ అఖండ 2 రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి సరోజ్ (Bandi Saroj) చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aghanda-2 release Akhanda movie sequel Akhanda-2 Balakrishna Bandi Saroj Boyapati Srinu Latest News in Telugu nandamuri balakrishna Telugu movie news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.