Band Melam Movie Trailer Release: ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ విశేషాలు

Read Time:  1 min
Band Melam Movie Trailer Release
Band Melam Movie Trailer Release
FONT SIZE
GET APP
Band Melam Movie Trailer Release
Band Melam Movie Trailer Release

Band Melam Movie Trailer Release: టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో, సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బ్యాండ్ మేళం’ విడుదలకు సిద్ధమైంది. ‘కోర్ట్’ సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా మరోసారి జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 26, 2026న (శ్రీరామనవమి కానుకగా) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read Also: Vanda Devullu First Look: విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’ ఫస్ట్ లుక్ రిలీజ్

ఒక స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్య ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ (కోన ఫిల్మ్ కార్పొరేషన్) సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించారు. ‘బేబి’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రానికి సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. సీనియర్ నటుడు సాయి కుమార్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాకు మరింత వెయిటేజీ పెరిగింది.

ట్రైలర్‌ లో హైలైట్స్

తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ట్రైలర్ గమనిస్తే, ఇది ఒక పక్కా పల్లెటూరి నేపథ్య ప్రేమకథగా కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి బావ, మ‌ర‌ద‌ల్లా కలిసి పెరిగిన గిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి) మధ్య ఏర్పడిన అనుబంధం, ఆ తర్వాత చోటుచేసుకున్న అపార్థాలు, సంగీతం చుట్టూ తిరిగే కథాంశం ఆసక్తికరంగా ఉన్నాయి. వినోదం, ఎమోషన్స్ మరియు విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.