📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Balakrishna: వైరల్ వీడియో..స్క్విడ్ గేమ్ ఆడిన బాల‌కృష్ణ, రాజీవ్ క‌న‌కాల‌

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సర్‌వైవల్ డ్రామా స్క్విడ్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన కంటెంట్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ గేమ్ 3 సీజన్‌లుగా ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు సంబంధించిన కంటెంట్‌ను ఏఐ (Artificial Intelligence) సాయంతో ఇండియన్ సెలబ్రిటీలతో రూపొందించటం సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.తాజాగా బాలీవుడ్‌, టాలీవుడ్ అభిమానులను అలరించేలా, ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), రాజీవ్ కనకాల, యాంకర్ అనసూయ స్క్విడ్ గేమ్‌లో పాల్గొన్నట్టు చూపిస్తూ రూపొందించిన ఈ వీడియో, సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటోంది.

https://twitter.com/i/status/1945733746558173457

గేమ్ రైడర్లను

ఈ వీడియోలో బాలకృష్ణ మాస్ మేనరిజం, డైలాగ్ డెలివరీ, ఓవర్ ది టాప్ యాక్షన్ ప్రేక్షకులను అలరిస్తోంది. బాలయ్య స్పెషల్ స్టైల్‌లో స్క్విడ్ గేమ్ టాస్క్ పూర్తి చేయకపోవడంతో రైడర్లు అతడిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో అఖండ 2 టీజర్ లాంటి బ్యాక్‌డ్రాప్‌లో, బాలయ్య శూలం తిప్పుతూ స్క్విడ్ గేమ్ రైడర్లను చిత్తుచేస్తాడు. బాలకృష్ణ అభిమానులు ఈ సీన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇక రాజీవ్ కనకాల (Rajiv Kanakala) విషయానికి వస్తే, ఆయన వీడియోలో మళ్ళీ చనిపోయే పాత్రలో కనిపిస్తారు. ఇది చూసిన నెటిజన్లు “ఇతని జీవితం మొత్తంలో చావడం తప్ప ఇంకేమీ లేదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ అనసూయ కూడా హైలైట్‌గా మారింది – తన క్లోజప్ రియాక్షన్స్‌తో స్క్విడ్ గేమ్‌లో ఒక రియల్ కంటెస్టెంట్ లా కనిపించారు.

Squid Game నిజజీవిత కథ ఆధారంగా తీసారా?

లేదు. Squid Game అనేది ఒక కల్పిత (ఫిక్షనల్) కథ. ఇది దక్షిణ కొరియాలో Hwang Dong-hyuk అనే దర్శకుడు రూపొందించిన టెలివిజన్ వెబ్ సిరీస్.

Squid Game కథ ఏమిటి?

Squid Game అనేది దక్షిణ కొరియాలో రూపొందించబడిన ఒక సర్‌వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ కథలో 456 మంది ఆటగాళ్లు, వీరంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారు, తమ జీవితాలను పణంగా పెట్టి ఒక రహస్య గేమ్ షోలో పాల్గొంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: My baby Movie: ‘మై బేబీ’ ట్రైల‌ర్ చూసారా?

ai generated celebrity videos anasuya viral video balakrishna squid game latest news rajeev kanakala funny video squid game indian version squid game with telugu actors squid gameBreaking News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.