📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Balakrishna: బాలయ్యకు రాఖీ కట్టిన సోదరి పురందేశ్వరి

Author Icon By Anusha
Updated: August 9, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఆనందంగా, ఘనంగా జరుపుకుంటున్నారు. సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా ప్రతి ఇంటిలోనూ సంతోష వాతావరణం నెలకొంది. సోదరీమణులు తమ అన్నల చేతికి రాఖీ కట్టి, ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షులు, విజయాలు కలగాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు. అన్నలు కూడా తమ చెల్లెల్లకు బహుమతులు, కానుకలు ఇస్తూ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంప్రదాయ వేడుకలో రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, ఇతర ప్రముఖులు కూడా పాలుపంచుకున్నారు.హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా ఈ రాఖీ పండుగను తన అక్క, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి జరుపుకున్నారు. బాలయ్య, పురందేశ్వరి ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకుని ఈ వేడుకను నిర్వహించారు. పురందేశ్వరి తన తమ్ముడు బాలకృష్ణకు రాఖీ కట్టి, ఆయుష్షు, ఆరోగ్యం కోసం ఆశీర్వచనాలు అందించారు. ఆ తరువాత బాలయ్య తన అక్క కాళ్లకు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంలో ఇద్దరూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.

అక్కకు డబ్బులు ఇవ్వాలి కదా

ఈ ఆనంద క్షణాలను దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్వయంగా వీడియో తీసి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె ట్వీట్‌లో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నచెల్లెలు మధ్య ఉండే బంధం ఎంత పవిత్రమైందో వివరించారు. ఈ వీడియోలో బాలయ్య సరదాగా “రాఖీ కట్టిన తర్వాత అక్కకు డబ్బులు ఇవ్వాలి కదా” అంటూ చమత్కరించడం కూడా కనిపించింది. ఈ హాస్యభరిత సంభాషణ వీడియోను చూసిన అభిమానులు, నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇవాళ రక్షాబంధన్.. నా మనసుకు చాలా దగ్గరైన పండుగ. ఇవాళ నేను నా తమ్ముడి చేతికి రాఖీ కట్టను. తమ్ముడు ఆరోగ్యంగా, సంతోషంగా, జీవితంలో ప్రతి కల నిజం కావాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

భవిష్యత్తులో కూడా సంతోషంగా, ప్రేమగా ఉండాలని

అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు శుభాకాంక్షలు.. జీవితంలో మీరు నాకు అండగా ఉన్నారు. మంచి స్నేహితులుగా ఉన్నారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీ కలలను నెరవేర్చుకోవడానికి శక్తిని పొందాలని.. ప్రతి అడుగులో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మనమందరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. భవిష్యత్తులో కూడా సంతోషంగా, ప్రేమగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగ జరుపుకుంటున్న తోబుట్టువులందరికీ శుభాకాంక్షలు. మీ బంధం రోజురోజుకూ బలపడాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలోని ప్రతి అక్కచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు నా ప్రేమ, ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో అన్నీ శుభాలే కలగాలని ఆశిస్తున్నాను. రక్షాబంధన్ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

బాలకృష్ణ రాజకీయాల్లో ఎప్పుడు ప్రవేశించారు?

బాలకృష్ణ 2014లో తొలిసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గానికి వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బాలకృష్ణకు ఉన్న బిరుదులు ఏమిటి?

అభిమానులు ఆయనను “NBK”, “బాలయ్య బాబు”, “హిందూపురం సింహం” అని పిలుస్తారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/mahesh-rajamouli-movie-mahesh-babus-birthday-big-update-from-ssmb29/cinema/528153/

Balakrishna Balayya Breaking News latest news Nandamuri family Purandeswari Purandeswari rakhi Rakhi celebrations Rakhi festival Raksha Bandhan Telugu News Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.