📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Bakasura Restaurant: విడుదలకు సిద్ధమైన ‘బకాసుర రెస్టారెంట్’ ఎప్పుడంటే?

Author Icon By Ramya
Updated: July 18, 2025 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బకాసుర రెస్టారెంట్ (Bakasura Restaurant): ఆగస్టు 8న విందు సిద్ధం

తెలుగు సినీ ప్రియులకు ఈ ఆగస్టు 8న ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant) పేరుతో ఓ ప్రత్యేక విందు సిద్ధమవుతోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ మంచి విందు భోజనం ఆరగించిన అనుభూతి కలుగుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష (Viva Harsha) టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి (బమ్‌చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, జబర్దస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Bakasura Restaurant: విడుదలకు సిద్ధమైన ‘బకాసుర రెస్టారెంట్’ ఎప్పుడంటే?

చిత్ర బృందం, సాంకేతిక నిపుణులు

ఎస్.జె. శివ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్.జె. మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్: మార్తండ్.కె.వెంకటేష్, సంగీతం: వికాస్ బడిస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్ కొట్టి, ఆర్ట్ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు లుగా వ్యవహరిస్తున్నారు.

దర్శకుల మాటల్లో ‘బకాసుర రెస్టారెంట్’

ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.జె. శివ (Director S.J. Siva) మాట్లాడుతూ, హంగర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది అని తెలిపారు. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మీ హృదయాలను హత్తుకునే ఎమోషన్‌ను అందిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూశామనే సంతృప్తిని పొందుతారు అని పేర్కొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, ఆగస్టు 8న అత్యధిక థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ‘బకాసుర రెస్టారెంట్’ ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వినూత్నమైన కామెడీ ఎంటర్‌టైనర్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

‘బకాసుర రెస్టారెంట్’ సినిమా దర్శకుడు ఎవరు?

“బకాసుర రెస్టారెంట్” సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన ఎస్‌జె శివా. ఈ సినిమా కెప్టెన్‌గా కూడా ఆయననే పేర్కొన్నారు. ఎస్‌జె మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి మరియు జనార్దన్ ఆచారి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: My Baby: ‘మై బేబి’ మూవీ రివ్యూ!

bakasura movie 2024 bakasura restaurant bakasura restaurant movie bakasura restaurant release date bakasura trailer Breaking News hunger comedy movie latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.