ఇటీవల కాలంలో టాలీవుడ్ (Tollywood) లో ఒక కొత్త ధోరణి కనిపిస్తోంది. పెద్ద సినిమాలు భారీ బడ్జెట్‌లు, స్టార్ హీరోలతో వస్తున్నా కూడా అన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. కానీ మరోవైపు చిన్న సినిమాలు మాత్రం కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా కథలో నూతనత, వినూత్నత ఉంటే తప్పనిసరిగా థియేటర్ (The Theater)లోకి వెళ్లి చూసే అవసరం లేదని భావిస్తున్నారు. అందువల్లే చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలపై విశేషమైన ఆదరణ లభిస్తోంది.
ఇటీవల విడుదలైన ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant) అనే చిత్రం దీనికి మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రవీణ్, వైవా హర్ష, గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యర్ వంటి నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా అందరి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎస్.జె. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్.జె. మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించారు.
బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది
ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు ప్రమోషన్లతో కొంత ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. ప్రధాన కారణం చిన్న సినిమా కాబట్టి ప్రేక్షకులు “ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాం” అనే ఆలోచనలో ఉండటమే. థియేటర్‌లలో ఆశించిన రీతిలో రాణించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫాం (Digital platform) లలో మాత్రం ఈ సినిమా బాగా రాణిస్తోంది.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) తో పాటు సన్ నెక్ట్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ టాప్ 6లో కొనసాగుతుండటం విశేషం.
కథేంటంటే
స్టోరీ విషయానికొస్తే.. పరమేశ్ (ప్రవీణ్) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా రెస్టారెంట్ పెట్టాలనేది అతడి కోరిక. ఏదొక అవాంతరంతో ఆ కోరిక వెనక్కి వెళ్లిపోతూ ఉంటుంది. దీంతో నచ్చకపోయినా ఉద్యోగం చేస్తూనే ఫ్రెండ్స్‌తో కలిసి ఘోస్ట్ రైడర్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఉంటాడు. అలా వీరంతా కలిసి ఓ బంగ్లాలోకి వెళ్లి వీడియో తీస్తుండగా ఓ పుస్తకం దొరుకుతుంది. దాన్ని తెరిచి చూడగా కొన్నాళ్ల క్రితం చనిపోయిన బక్క సూరి అలియాస్ బకాసురుడు (వైవా హర్ష) ఆత్మ నిద్రలేస్తుంది.
ఆ తర్వాత పరమేశ్, అతడి స్నేహితులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నదే మిగతా కథ. అది తిండిపోతు దెయ్యం కావడంతో ఆ తర్వాత జరిగే గందరగోళ సంఘటనలు, నవ్వులు పూయించే కామెడీ ఈ సినిమాని ఆసక్తికరంగా మార్చాయి. అయితే కేవలం చిన్న సినిమా అన్న కారణంతోనే ప్రేక్షకులు దీన్ని థియేటర్లలో పట్టించుకోలేనట్లుగా తెలుస్తోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో అరెరే ఇంత మంచి సినిమాని ఎలా మిస్ అయ్యామా అని తప్పు తెలుసుకుని ఇప్పుడు తెగ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: