📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Badmashulu Movie: బద్మాషులు (ఈటీవీ విన్) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: August 9, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓటీటీ వేదికలపై గ్రామీణ నేపథ్యంలోని కథలకు ఇటీవల మంచి ఆదరణ లభిస్తోంది. ‘బలగం’ వంటి సినిమాలు గ్రామీణ జీవన శైలిని, ఆ ప్రాంతపు భావోద్వేగాలను నిజ జీవితానికి దగ్గరగా చూపించడం ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. ఈ తరహా విజయాలు నిర్మాతలకు, దర్శకులకు నూతన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. అదే తరహాలో తెరకెక్కిన మరో సినిమా ‘బద్మాషులు’ (Badmashulu).శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జూన్ 6న థియేటర్లలో విడుదలై, మంచి టాక్ ను తెచ్చుకుంది. ప్రేక్షకులు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా వీక్షించేందుకు ఆసక్తి చూపారు.ఈ నెల 8వ తేదీ నుంచి ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ సారాంశం

కోతుల గూడెం’ గ్రామంలో తిరుపతి (మహేశ్ చింతల), ముత్యాలు (విద్యాసాగర్) అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. తిరుపతి ఇంటి దగ్గరే టైలరింగ్ చేస్తూ ఉంటాడు. అతనికి మహా బద్ధకం .. తాగడం కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మాయమాటలు చెబుతూ, తెలివిగా గండాల నుంచి బయటపడుతూ ఉంటాడు. అవసరమైతే, ఒకరు ఇచ్చిన బట్టలను మరొకరికి ఇచ్చేస్తూ ఉంటాడు. భార్య ఎంతగా చెప్పినా అతను వినిపించుకోడు.ఇక ‘ముత్యాలు’ విషయానికి వస్తే అతను బార్బర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి సెలూన్ షాప్ (Salon Shop) ఉంటుంది కానీ, అందులో అతను కుదురుగా కూర్చోడు. ఊళ్లో తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ కటింగ్ చేసేస్తూ ఉంటాడు. డబ్బులు చేతిలో పడితేనే తప్ప అతను కత్తెర పట్టుకోడు. సంపాదన  సంగతి అలా ఉంచితే, భార్య టార్చర్ ను భరించలేకపోతుంటాడు. అందుకు కారణం ఎదురింటి లత .. ఆమెను గతంలో అతను లవ్ చేశాడనే విషయం భార్యకి తెలియడం.  

విశ్లేషణ

ఇద్దరు స్నేహితులు కూడా తాగుడికి బానిసలు. పనిచేయడానికి బద్ధకిస్తూ ఉండటం వలన సంపాదన అంతంత మాత్రం. వాళ్ల గురించి తెలిసినవారెవరూ అప్పు ఇవ్వరు. దాంతో ఇద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడతారు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ల దగ్గర డబ్బులు ఎక్కడివనేది ఎవరికీ అర్థం కాదు. అప్పుడు వాళ్లకి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. అదేమిటి? పర్యవసానాలు ఎలాంటివి? అనేది కథ. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ‘బద్మాష్’ అనే తిట్టు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వాడు పెద్ద ముదురు అనే మాటకు బదులుగా, వాడు పెద్ద ‘బద్మాష్’ గాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఇద్దరి స్నేహితుల కథ కావడం వలన, ‘బద్మాషులు’ అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ టైటిల్ కి తగినట్టుగా ఈ కథ నడిచిందా అంటే, నడిచిందనే చెప్పాలి

‘బద్మాషులు’ సినిమా ఏ తరహా కథపై ఆధారపడి ఉంది?

ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలోని కామెడీ, యాక్షన్, డ్రామా కలగలిపిన కథ.

‘బద్మాషులు’ సినిమాకు దర్శకుడు ఎవరు?

ఈ సినిమాకు దర్శకత్వం వహించినది శంకర్ చేగూరి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/balakrishna-sister-purandeswari-tied-rakhi-to-balayya/cinema/528184/

Badmashulu Balagam Movie ETV Win OTT Rural Backdrop Rural Stories Shankar Cheguri Telugu cinema Telugu News Telugu OTT Release

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.