📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Azadi: ఆజాది (ఆహా) మూవీ రివ్యూ

Author Icon By Saritha
Updated: January 7, 2026 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Azadi (Aha) Movie Review

మలయాళంలో రూపొందిన ఓ రివేంజ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. (Azadi) ఆ సినిమా పేరే ఆజాది. క్రితం ఏడాది మే 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆ తరువాత మలయాళంలో ఒకటి రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి ‘Aha’లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ శ్రీనాథ్ భాసి ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. జో జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

Read also: TG: కవిత ఇంటిపేరు మార్పుపై ఆసక్తికర చర్చ

కథ

ఒక రాజకీయనాయకుడి ఇంటికి వెళ్లి అతని కొడుకుని హత్య చేసిన నేరంపై గంగ (రవీనా రవి) జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటుంది. (Azadi) తన చెల్లెలి ఆత్మహత్యకి కారకుడైనందు వల్లనే ఆమె అతనిని హత్య చేస్తుంది. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమెకి డెలివరీ డేట్ వచ్చేస్తుంది. దాంతో ఆమెను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుస్తారు. గంగ తండ్రి శివ ( లాల్) ఆమె భర్త రఘు ( శ్రీనాథ్ భాసి) హాస్పిటల్ కి చేరుకుంటారు. ఈ ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఆ రాజకీయనాయకుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. 

గంగ డెలివరీ అయిన తరువాత బేబీతో పాటు ఆమెను హాస్పిటల్ నుంచి తప్పించాలని శివ – రఘు నిర్ణయించుకుంటారు. హాస్పిటల్లో నర్స్ గా పనిచేసే ‘మినీ’ .. అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే బాబుతో పాటు, సత్య జినూ సాయం తీసుకుంటారు. అయితే హాస్పిటల్ లో గంగకి కాపలాగా పోలీస్ టీమ్ ఉంటుంది. అలాగే గంగ ఫ్యామిలీపై ప్రతీకారం తీసుకోవడం కోసం రాజకీయనాయకుడు పంపించిన బ్యాచ్ అక్కడే ఉంటుంది. 

దాంతో రఘు తన భార్య బిడ్డలతో హాస్పిటల్ నుంచి ఎలా బయటపడాలనే విషయంపై గట్టిగానే కసరత్తు చేసి ఒక ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ ను అందరికి అర్థమయ్యేలా చెబుతాడు. అయితే ఊహించని విధంగా గంగ రక్షణ కోసం పోలీస్ ఆఫీసర్ రాణి (వాణీ విశ్వనాథ్) రంగంలోకి దిగుతుంది. అప్పుడు రఘు బ్యాచ్ ఏం చేస్తుంది? గంగను హాస్పిటల్ నుంచి తప్పించగలుగుతారా? అనేదే కథ.  

విశ్లేషణ

ఈ కథ ఒక హాస్పిటల్ నేపథ్యంలోనే కొనసాగేలా దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. పోలీసులు హంతకులు హత్య చేయబడినవారి తాలూకు మనుషులు హంతకుల కుటుంబ సభ్యులు ఇలా అన్ని వైపుల నుంచి కీలకమైన పాత్రలన్నీ హాస్పిటల్ కి చేరుకోవడం అక్కడ చోటుచేసుకునే యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ను దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ముగింపు

ఈ కథను చూస్తున్నంత సేపు ఒక కోణంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకే ఒక్క ట్విస్ట్ తో అప్పటివరకూ మనం ఆ కథను చూసిన కోణమే మారిపోతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? ఆ కథేమిటి? అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు రక్తపాతాలు లేకుండా సాగే ఏ సినిమాను, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aha Streaming Azadi Movie Latest News in Telugu Malayalam Cinema OTT Release revenge thriller Srinath Bhasi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.