Ayaa Sher Song Promo: ది ప్యారడైజ్’ నుంచి ‘ఆయా షేర్’ ప్రోమో విడుదల

Read Time:  1 min
Ayaa Sher Song Promo: ది ప్యారడైజ్’ నుంచి ‘ఆయా షేర్’ ప్రోమో విడుదల
FONT SIZE
GET APP
‘Ayaa Sher’ promo from ‘The Paradise’ released
‘Ayaa Sher’ promo from ‘The Paradise’ released

Ayaa Sher Song Promo: నేచురల్ స్టార్ నాని అభిమానులకు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ సిద్ధమైంది. నాని హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి మోస్ట్ అవేటెడ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Read Also: Nani-Triptii Dimri: నాని సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి?

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

ద‌స‌రా తర్వాత మళ్లీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌– నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘ఆయా షేర్’ పాటను వందలాది డ్యాన్సర్లతో రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున చిత్రీకరించినట్టు యూనిట్ వెల్లడించింది. ఈ పాటకు చార్ట్‌బస్టర్ బాణీలు అందించినది ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ర‌విచంద‌ర్. సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. బర్త్‌డే సందర్భంగా విడుదలయ్యే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

మొదట మార్చి 26న విడుదల చేయాలని భావించిన ఈ చిత్రాన్ని వాయిదా వేసి, ఇప్పుడు ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘ది ప్యారడైజ్’ను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఎడిటర్‌గా నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్‌గా సి.హెచ్. సాయి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్ల పని చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.