📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rajinikanth: సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

Author Icon By Anusha
Updated: December 4, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏవీఎం శరవణన్ పార్థివదేహానికి నివాళులర్పించిన రజినీకాంత్

ఏవీఎం సంస్థలో 9 సినిమాలు చేశానని వెల్లడి

ప్రముఖ నిర్మాత, ఏవీఎం స్టూడియోస్ అధినేత శరవణన్‌(85)  (AVM Saravanan) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో చెన్నైలోని ఆయన నివాసంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శరవణన్‌ మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

Read Also: Naga Chaitanya: నాగచైతన్య-శోభిత ధూళిపాళ: మొదటి వివాహ వార్షికోత్సవం

తన కష్టకాలంలో శరవణన్ అండగా నిలిచారని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. శరవణన్ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం రజినీకాంత్ (Rajinikanth) మీడియాతో మాట్లాడారు.”శరవణన్ గారు చాలా గొప్ప వ్యక్తి, నిజమైన పెద్దమనిషికి ఆయన నిలువుటద్దం. ఎప్పుడూ తెల్లని దుస్తులు ధరించేవారు, ఆయన మనసు కూడా అంతే స్వచ్ఛమైనది.

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఆయన. నిమిషాల పాటు మాట్లాడితే, అందులో చాలాసార్లు తన తండ్రి ‘అప్పాచి’ని గుర్తుచేసుకునేవారు” అని రజినీకాంత్ తెలిపారు.శరవణన్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ, “ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడేవారు, నా శ్రేయోభిలాషి. నా కష్ట సమయాల్లో నాకు అండగా నిలిచారు.

AVM Saravanan is a person who loves cinema as his life: Rajinikanth

ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా

ఏవీఎం  (AVM) సంస్థలో నేను 9 సినిమాలు చేశాను. ఆ తొమ్మిది చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఆ విజయాలకు ప్రధాన కారణం శరవణన్ గారేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు” అని వివరించారు. 80వ దశకంలో ‘మురట్టు కాళై’, 2000లలో ‘శివాజీ’ వంటి భారీ చిత్రాలను ఏవీఎం సంస్థ నిర్మించిందని,

2020లలో కూడా తనతో మరో సినిమా చేసేందుకు చర్చలు జరిపారని, కానీ అది కార్యరూపం దాల్చలేదని రజినీకాంత్ గుర్తుచేసుకున్నారు. శరవణన్ మృతి తనను ఎంతగానో బాధించిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రజినీకాంత్ పేర్కొన్నారు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AVM Saravanan AVM Studios latest news Saravanan death Saravanan passes away Tamil Film Industry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.