📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Avatar 3 Movie: అవతార్ 3 మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: December 19, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3 Movie) శుక్రవారం (డిసెంబర్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే రెండు భాగాలతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన అవతార్ ఫ్రాంచైజీకి ఇది మూడో చిత్రం కావడంతో రిలీజ్‌కు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా హాలీవుడ్‌తో పాటు ఇండియాలోనూ ఈ సినిమా (Avatar 3 Movie) కు భారీ క్రేజ్ కనిపించింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.

Read Also: Dhurandhar Movie: భారీ ధరకు ‘ధురంధర్’ ఓటీటీ డీల్

కథ

ముందు నుంచి అవతార్ అంటే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. అక్కడే తన కథ రాసుకుంటున్నాడు జేమ్స్ కెమెరూన్. అవతార్ 2లో సముద్ర గర్భాన్ని చూపించిన ఆయన.. ఈసారి కథను నిప్పు దగ్గరికి వచ్చాడు. జేక్ సల్లీ కుటుంబం సెకండ్ పార్ట్ మొత్తం నీళ్లలో నివసించే వాళ్లతో కొట్లాడుతూ ఉంటారు.. తమ తెగ కోసం హీరో పోరాడుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి పండోరలోని అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే యాష్ పీపుల్ అనే కొత్త తెగను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతిని ప్రేమించే నావీలకు పూర్తి భిన్నంగా.. కాస్త క్రూరంగా ఉండే ఈ కొత్త తెగతో జేక్ కుటుంబానికి వచ్చిన ముప్పు ఏంటి..? ఈ ఘర్షణలో వారు ఎలా బయటపడ్డారు..? అనేదే ఈ సినిమా కథ.

Avatar 3 Movie Review

విశ్లేషణ

జేమ్స్ కెమెరూన్ సినిమా అంటే ఎలా ఉన్నా కూడా చూడడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు.నిజం చెప్పాలంటే పదహారేళ్ల కింద వచ్చిన అవతార్ సినిమా చూసినప్పుడు ప్రపంచ సినిమా మొత్తం మైమరిచిపోయింది. అలాంటి సినిమా ఎలా తీయగలిగాడు అంటూ మొత్తం ప్రపంచమే జేమ్స్ కెమెరూన్ గురించి మాట్లాడుకుంది. ఆ సినిమా క్లైమాక్స్‌లో గానీ, ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు గానీ కలిగిన ఆ కిక్, ఈ సీక్వెల్స్‌లో దొరకడం లేదు. ఆల్రెడీ మూడేళ్ల కింద వచ్చిన అవతార్ 2లో కథనం నెమ్మదించిందని విమర్శలు వచ్చాయి.

ఈ మూడవ భాగంలోనూ అదే సమస్య కనిపిస్తుంది. కథ, కథనం సినిమాకు ప్రధాన బలహీనతలుగా మారాయి. చూసిన సన్నివేశలు మళ్లీ మళ్లీ చూసినట్టు అనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ మార్క్ ఎమోషన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఇందులో లోపించాయి. ఒక మాస్టర్ పీస్ నుండి ఆశించే ఆ అడ్రినలిన్ రష్ ఈ సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పాలి. కథ పరంగా నిరాశపరిచినా, టెక్నికల్ అంశాల్లో మాత్రం ఈ సినిమా ఒక అద్భుత దృశ్యకావ్యమే.

VFX క్లారిటీ చూస్తే మతిపోతుంది. ప్రతీ ఫ్రేమ్‌లోనూ దర్శకుడు తీసుకున్న జాగ్రత్త, ఆ డిటైలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం వాడిన రంగులు, బ్రైట్‌నెస్, విజువల్ పాలిష్ అన్నీ బాగా కుదిరాయి. తెరపై ఆ విజువల్స్ చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కేవలం ఈ విజువల్ గ్రాండియర్ కోసమే సినిమాను చూడొచ్చు.

ఇలాంటి సినిమాలను మంచి స్క్రీన్ మీదే చూడాలి. 3D ఎఫెక్ట్స్ చాలా ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. ముఖ్యంగా PCX స్క్రీన్‌పై చూస్తే.. ఆ అనుభూతి ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గానీ, ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నామనే భావన గానీ 3Dలో అద్భుతంగా పండాయి. టెక్నాలజీని వాడుకోవడంలో కామెరూన్ ఎప్పుడూ ముందుంటాడని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

avatar Avatar 3 Avatar 3 Movie Review Hollywood Movie James Cameron latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.