📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘Aspirants 3’ Series Review: ‘ఆస్పిరెంట్స్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

Author Icon By Aanusha
Updated: March 17, 2026 • 10:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూత్ మరియు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ‘ఆస్పిరెంట్స్’ సిరీస్ తన మూడవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టీవీఎఫ్ (TVF) నిర్మించిన ఈ సిరీస్, మార్చి 13వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.

Read Also: Anirudh Ravichander: యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

కథా నేపథ్యం

అభిలాష్ శర్మ (నవీన్ కస్తూరియా) సందీప్ (సన్నీ హిందూజా) ఒకప్పుడు స్నేహితులే అయినా, ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. రామ్ పూర్ కి డీఎమ్ గా ఉన్న అభిలాష్ శర్మ, సందీప్ కారణంగా ఒక విచారణను ఎదుర్కుంటూ ఉంటాడు. ఆ విచారణ ఫలితం ఎలా ఉండనుందోననే ఆందోళన అతనిని వెంటాడుతూనే ఉంటుంది. అయినా అభిలాష్ తన బాధ్యతలను తాను నిర్వర్తిస్తూ వెళుతుంటాడు.

ఈ నేపథ్యంలోనే రామ్ పూర్ ను ‘ఎడ్యుకేషన్ టౌన్’ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అందుకు అవసరమైన ప్రాజెక్టు కోసం వెయ్యి ఎకరాల భూమిని సేకరించే బాధ్యతను అభిలాష్ కి అప్పగిస్తారు. ఆ సమయంలోనే ‘సంభాల్’ డీఎమ్ గా పవన్ కుమార్ (జతిన్ గోస్వామి) అక్కడ అడుగుపెడతాడు. ఆ ప్రాజెక్టును ‘సంభాల్’లో చేపడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.             

‘Aspirants 3’ Series Review

ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని సేకరించడం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని పవన్ కుమార్ అంటాడు. ఈ విషయంలో తనకి సందీప్ సహకారం ఉంటుందని చెబుతాడు. ఊహించని విధంగా అక్కడికి వచ్చిన పవన్ కుమార్ ను చూసిన అభిలాష్, తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. తన శత్రువైన సందీప్ తో కలిసి పనిచేస్తానని పవన్ కుమార్ చెప్పడం అభిలాష్ కి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తుంది. 

అభిలాష్ కీ .. పవన్ కుమార్ కి మధ్య యూపీఎస్సీ ప్రిపరేషన్స్ నుంచి గొడవలు ఉంటాయి. దీప( టెంగం సెలిన్) తో ప్రేమలో ఉన్న అభిలాష్, ‘ఆస్థా’తో లవ్ లో ఉన్న పవన్ కుమార్ మధ్య ఆ రోజులలోనే గొడవలు ఉంటాయి. అందుకు గల కారణం ఏమిటి? దీప .. ఆస్థా ఏమైపోయారు? పాత కాలం నాటి శత్రుత్వం ఇప్పటి వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది కథ. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Amazon Prime Video Aspirants Season 3 Naveen Kasturia Sunny Hinduja TVF Series

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.