Arjun Sarja: నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు: అర్జున్

Read Time:  1 min
Arjun Sarja: నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు: అర్జున్
FONT SIZE
GET APP

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా(Arjun Sarja) చాలా కాలం తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సినిమా ‘సీతా పయనం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందులో అర్జున్ కుమార్తె ఐశ్వర్య, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ జంటగా నటిస్తున్నారు. అర్జున్‌, ధ్రువ్ సర్జా ప్రత్యేక పాత్రలు పోషించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ త్రిభాషా చిత్రం, వాలంటైన్స్ డే (Valentine’s Day) కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాకి అర్జున్, ఐశ్వర్య ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Read Also: Thalapathy Vijay: జన నాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్?

Arjun Sarja: నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు: అర్జున్
Those around me betrayed me: Arjun

ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా నాకు తెలియలేదు

ఈ సందర్భంగా(Arjun Sarja) ఆయన మాట్లాడుతూ తెలుగులో నేను చేసిన మొదటి సినిమాకి గాను పారితోషికంగా అందుకున్నది పాతికవేలు. నేను ప్లాన్ చేసుకోలేదు గానీ నా కెరియర్ గ్రాఫ్ చాలా బాగా వెళ్లింది. చాలా చిన్న వయసులోనే ఎక్కువ డబ్బు వచ్చేసింది. అప్పట్లో ఆ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా నాకు తెలియలేదు అని అన్నారు. ఎవరూ ఏమిటనేది నేను చెప్పను గానీ, నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు.

అందువలన నేను చాలా నష్టపోయాను. ఆ ప్రాపర్టీస్ ఈ రోజున ఉంటే నేను మరో రేంజ్ లో ఉండేవాడిని. శోభన్ బాబు గారు నాకు చాలా క్లోజ్. నాతో ఉన్నంత చనువుగా ఆయన ఎవరితోనూ ఉండేవారు కాదు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు కూడా. ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు. కానీ అప్పుడు నాకు అవి ఎక్కలేదు అని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.