📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

Arabia Kadali : అరేబియా కడలి (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

Author Icon By Anusha
Updated: August 11, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సముద్రం, పడవలు, వలలు, అలలతో పోరాటం, ఇవన్నీ జాలరుల జీవితానికి ప్రతిరోజు జరిగే సంగతులే. కానీ ఆ జీవనంలో దాగి ఉన్న కష్టాలు, భావోద్వేగాలు, బతుకుబండిని నెట్టుకునే పోరాటం, మానవ సంబంధాలు, ద్రోహం, ఆశలు, నిరాశలు – ఇవన్నీ తెరపై సహజంగా చూపించడం అంత తేలికైన పని కాదు. అయితే, సత్యదేవ్ – ఆనంది ప్రధానమైన పాత్రలను పోషించిన ‘అరేబియా కడలి’ (Arabian Kadali series) కూడా ఇదే నేపథ్యంలో రూపొందింది. సూర్య కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 8వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ

చేపలవాడ – మత్స్యవాడ సముద్రతీరంలో .. పక్కపక్కనే ఉన్న గ్రామాలు. అయితే అక్కడి సముద్రంలో చేపలు పట్టడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. జెట్టీ .. ఫిషింగ్ హార్బర్ వస్తే తప్ప చేపల వేట సాధ్యపడదు. అందువలన ఆ గ్రామాల నుంచి జాలరులు గుజరాత్ కి వలస వెళుతూ ఉంటారు. అక్కడి ‘సంగరోల్’ నుంచి వాళ్లకి ఒక ఏజన్సీ బోట్లు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మగాళ్లంతా చేపలవేటకు గుజరాత్ (Gujarat) వెళ్లి వచ్చేవరకూ, వారి కుటుంబాలు భయం గుప్పెట్లో బ్రతుకుతుంటాయి. చేపలవాడకి చెందిన బద్రి ( సత్యదేవ్) మత్స్యవాడికి చెందిన గంగ (ఆనంది) ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు గ్రామాలకి మధ్య పాత పగలు .. ప్రతీకారాలు ఉంటాయి.  తమ ఊళ్ల మధ్య గొడవలుపోయి, చేపలవేటలోని ఇబ్బందులు తొలగిపోవడం కోసం గంగ – బద్రి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే బద్రితో గంగ తిరగడం ఆమె తండ్రి నానాజీకి ఎంతమాత్రం నచ్చదు. తన ఊరికి చెందిన శేఖర్ (వంశీకృష్ణ) కి గంగను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు.       

Arabia Kadali:

కథనం

ఈ నేపథ్యంలోనే చేపలవాడ నుంచి బద్రి .. మత్స్యవాడ నుంచి నానాజీ బృందం గుజరాత్ కి వెళతారు. అక్కడి ఏజన్సీవారు ఏర్పాటు చేసిన పాత పడవలలో సముద్రంలోకి వెళతారు. కొంతదూరం వెళ్లిన తరువాత ‘బోట్’లోని సాంకేతిక సమస్యలను గుర్తిస్తారు. అదే సమయంలో తాము పాకిస్థాన్ సముద్రజలాలలోకి వచ్చేశామని గ్రహిస్తారు. వెంటనే బోట్లను వెనక్కి తిప్పుతారు. కానీ అప్పుడే పాకిస్థాన్ నేవీకి దొరికిపోతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కథ. భారతదేశానికి చెందిన కొంతమంది మత్స్య కారులు, తమకి తెలియకుండానే పాకిస్థాన్ జలాలలోకి ప్రవేశించడం, అక్కడి నేవీ సిబ్బందికి చిక్కడం, పాకిస్థాన్ జైల్లో నానా హింసలకు గురికావడం, ఆ ఊరికి చెందిన ఒక యువతి వారికి కాపాడటానికి ప్రయత్నించడం వంటి కథతో ఇంతకుముందు ‘తండేల్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కాస్త అటు ఇటుగా అదే కథతో రూపొందిన సిరీస్ ఇది.

‘అరేబియా కడలి’ సిరీస్ ఎక్కడ చూడవచ్చు?

‘అరేబియా కడలి’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.

‘అరేబియా కడలి’ కథ ఏమిటి?

ఇది డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ మేళవింపుతో కూడిన కథ. అరేబియా సముద్రం నేపథ్యంలో సాగే క్రైమ్ మరియు మిస్టరీ కథాంశం ప్రధాన ఆకర్షణ.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sanju-samson-i-am-a-big-fan-of-rajinikanth/sports/528788/

amazon prime series Anandi arabian kadali Arabian Sea Breaking News fisherman life latest news OTT Release Satyadev Surya Kumar telugu entertainment Telugu News Telugu Web Series

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.