📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Anurag Kashyap: సెన్సార్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అనురాగ్ కశ్యప్..ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీసుకుంటున్న నిర్ణయాలపై సినీ పరిశ్రమలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మధ్య కాలంలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే మలయాళ సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకోవడం దీనికి ప్రధాన కారణం. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పేరు ‘జానకి’గా ఉండగా, అది సీతమ్మ పేరుతో అనుసంధానం ఉందంటూ, సీబీఎఫ్‌సీ ఆ పేరు మార్చాలని సూచించింది.ఈ నిర్ణయంపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘కథలకు బ‌తికున్న వ్యక్తుల పేర్ల‌ను పాత్ర‌ల‌కు ఎలాగో పెట్టలేము.ఇంకా అక్క‌డ ఏమి మిగిలి ఉంది. మన పాత్రలను XYZ, 123, ABC అని పిలవాలా? అని అనురాగ్‌ ప్రశ్నించారు.సృజనాత్మకతకు అడ్డుగా మారుతున్న సెన్సార్ నిర్ణయాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

రూపొందించిన సినిమాలు

పాత్ర‌ల‌కు ఇంటిపేర్లు, డార్క్ షేడ్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న కూడా స‌మ‌స్యేన‌ని అవి కేవ‌లం ఎటువంటి త‌ప్పు చేయ‌కుండా తెల్ల‌గా ఉండాల‌ని సెన్సార్ (Sensor board) కోరుకుంటుద‌ని ఇలాంటి స‌మ‌స్య‌ల కార‌ణంగానే చాలా సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాకుండా ఆగిపోతున్నాయ‌ని అనురాగ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నైతిక పాఠాలు నేర్పడానికి రూపొందించిన సినిమాలు నిజంగా సమాజాన్ని మార్చలేవని నిజాయితీగా కథ చెప్పడం చాలా ముఖ్యమని అనురాగ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్ర‌స్తుతం అలాంటి సినిమాలు రావ‌ట్లేద‌ని అనురాగ్ తెలిపాడు.

Anurag Kashyap

విధానాలపై విమర్శలు

ఇక బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి కూడా స్పందించారు. ఆమె నటించిన ‘సూపర్‌మ్యాన్’ అనే చిత్రంలోని 33 సెకన్ల కిస్సింగ్ సీన్‌ను తొలగించడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘ఇది ప్రజలను కలవరపరిచేలా చేస్తోంది. సినిమా అంత భయపడే విషయం కాదు’’ అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు.టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) కూడా CBFC విధానాలపై విమర్శలు గుప్పించారు. అయితే, ఆయన పూర్తిగా వివాదాల గురించి స్పందించకపోయినా, సెన్సార్ బోర్డు ఆంక్షల వల్ల తెలుగు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు.

అనురాగ్ కశ్యప్ ఏ రాష్ట్రానికి చెందినవాడు?

సెప్టెంబర్ 10, 1972న జన్మించిన అనురాగ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పెరిగారు. అతని తల్లి గృహిణి, క్షయవ్యాధితో మరణించగా, అతని తండ్రి ఓబ్రా థర్మల్ పవర్ స్టేషన్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.

అనురాగ్ కశ్యప్ పూర్తి పేరు?

అనురాగ్ కశ్యప్ పూర్తి పేరు.అనురాగ్ సింగ్ కశ్యప్.

Read hindi news: hindi.vaartha.com

Read Also: OTT: రేపు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న టాప్ తెలుగు సినిమాలు

Anurag Kashyap CBFC Criticism Breaking News CBFC Controversy Telugu Janaki vs State of Kerala Censorship latest news Shreya Dhanwanthary Kiss Scene Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.