టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ప్రేమజంటల గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా రోమియో–జూలియెట్, రాధా–కృష్ణుల ప్రేమ కథలను ప్రస్తావించిన అనుపమ,సూపర్ స్టార్ మహేష్ బాబు–నమ్రత శిరోద్కర్‌ల జోడీని మూడవ జంటగా పేర్కొంది..
Read Also: OTT Records: ‘ధురంధర్’ విధ్వంసం.. 10 రోజుల్లోనే లక్షలాది వ్యూస్!
టర్నింగ్ పాయింట్
మహేష్‌తో కలిసి అనుపమ (Anupama Parameswaran) ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. భవష్యత్తులో ఆ అవకాశం రావాలని అలా మహేష్ జంటని మెన్షన్ చేసిందో లేక యాక్సిడెంటల్‌గా చెప్పిందో తెలియాల్సి ఉంది.. ఇదిలా ఉంటే చేజేతులా పోగొట్టుకున్న క్రేజీ అవకాశం మళ్లీ అనుపమ పరమేశ్వరన్‌ను వెతుక్కుంటూ వచ్చినట్టుగా తెలుస్తోంది.గత కొన్నేళ్ల క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్‌ల కలయికలో తెరకెక్కిన మూవీ రంగస్థలం. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.అయితే ఇందులో ముందు హీరోయిన్ సమంత కాదు.
ఆ అవకాశం ముందు వరించింది అనుపమ పరమేశ్వరన్‌నే. అయితే ఆ టైమ్‌లో తనని వెతుక్కుంటూ వచ్చిన భారీ ఆఫర్‌ని, కెరీర్ టర్నింగ్ ఛాన్స్‌ని డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల అనుపమ పరమేశ్వరన్ చేజేతులా వదిలేసుకోవాల్సి వచ్చింది.ఇప్పుడు రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: