📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

ఓటీటీలోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..

Author Icon By Anusha
Updated: February 18, 2025 • 5:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఊహించని ట్విస్టులు వణుకుపుట్టించే విజువల్స్ మూవీస్ చూసేందుకు సినీప్రియులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు రోజు రోజుకు మరింత ఆదరణ లభిస్తుంది. తాజాగా మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు లవర్ బాయ్ గా సినీరంగంలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో ఆ తర్వాత వరుస ప్లాపులతో సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వరుణ్ సందేశ్.బిగ్ బాస్ రియాల్టీ షోతో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడిప్పుడే విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.తాజాగా వరుణ్ సందేశ్ నటించిన విరాజి అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2023 ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైంది. అయితే, సినిమాకు రిలీజ్‌కు ముందే మంచి బజ్ క్రియేట్ అయినప్పటికీ, విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ట్రైలర్, పోస్టర్స్, టీజర్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగినా, సినిమా థియేట్రికల్ రన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీ ద్వారా ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023 ఆగస్టు 22న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా విడుదలైంది. ఇది ఉచితంగా కాకుండా రూ.99 చెల్లించి రెంటల్ విధానంలో చూడాల్సిన విధంగా అందుబాటులోకి తెచ్చారు. ఫిబ్రవరి 18, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

విరాజి సినిమాకు ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించగా, వరుణ్ సందేశ్ ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఇప్పటి వరకూ చేసిన లవర్ బాయ్ పాత్రలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలో ఆయన నటన కనిపించింది. కథ నడకలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సైకలాజికల్ యాంగిల్ కూడా ఉండటంతో సినిమా కథపరంగ ఆసక్తికరంగా సాగింది.

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన ప్రమోదిని హీరోయిన్‌గా నటించగా, రఘు కారుమంచి, బలగం జయరాం, రవితేజ నానిమ్మల, వైవా రవితేజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వారి పాత్రలు కూడా కథానుగుణంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

టెక్నికల్ అంశాలు:

సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలాన్నిచ్చాయి. థ్రిల్లర్ సినిమాకు తగ్గట్లుగా విజువల్స్, సౌండ్ డిజైన్ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

వరుణ్ సందేశ్‌తో పాటు, ప్రమోదిని, రఘు కారుమంచి, బలగం జయరాం, వైవా రవితేజ, రవితేజ నానిమ్మల తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.థియేటర్లలో పెద్ద విజయం సాధించకపోయినా, ఓటీటీ వేదికపై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కథలు ఎంచుకోవడం ద్వారా వరుణ్ సందేశ్ తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

#AhaVideo #AmazonPrimeVideo #BiggBossVarunSandesh #NewOTTRelease #ottrelease #PsychologicalThriller #TeluguCinema #OTTRelease #AmazonPrimeVideo #AhaVideo #PsychologicalThriller #Tollywood #VarunSan #TeluguMovies2025 #ThrillerMovie #Tollywood #VarunSandesh #VarunSandeshReturns #Virajamovie Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.