📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Balayya-Puri Combo: బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా?

Author Icon By Aanusha
Updated: February 23, 2026 • 8:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Balayya-Puri Combo: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో మరోసారి చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ, బాలయ్యను ఒక సరికొత్త స్టైలిష్ అవతార్‌లో చూపించడంలో పూరీ సక్సెస్ అయ్యారు. ఆ సినిమాతో వీరిద్దరి మధ్య ఏర్పడిన మంచి బాండింగ్ ఇప్పుడు రెండో సినిమా వైపు అడుగులు వేయిస్తోందని సమాచారం.

Read also: VIROSH: విజయ్ దేవరకొండ, రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

బాలయ్య ఆటిట్యూడ్.. పూరీ మార్క్ మేకింగ్

ఇప్పుడీ కాంబో మళ్లీ రిపీట్ కావచ్చన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫామ్‌లో లేకపోయినా, ఆయన స్టైలిష్ మేకింగ్‌, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌పై బాలయ్య నమ్మకం ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. సరైన కథతో వస్తే పూరీతో మరోసారి పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Another film in the Balayya-Puri Jagannath combo?

అఖండ’ నుంచి నందమూరి బాలకృష్ణ, చూపిస్తున్న జోరు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. యంగ్ డైరెక్టర్లతో చేతులు కలిపి తన ఇమేజ్‌కు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకోవడం బాలయ్య విజయాలకు ప్రధాన కారణంగా మారింది. ఇటీవలి కాలంలో బాలయ్య కథ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడి ఇమేజ్ కంటే కథలోని కొత్తదనం, పాత్ర బలమే ఆయనకు ప్రాధాన్యతగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మళ్లీ తన పూర్వ వైభవాన్ని చూపించాలని పూరీ భావిస్తున్నారు. చాలాకాలంగా సరైన్ హిట్ లేక సతమతమవుతోన్న ఆయన ఆ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి తన సత్తా ఏమిటో చూపించాలని పట్టుదలగా ఉన్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Balayya Puri Combo NBK New Movie Tollywood Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.