📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Anna Garu Vastaru Movie: ఓటీటీలోకి వస్తోన్న కార్తీ కొత్త సినిమా

Author Icon By Anusha
Updated: January 28, 2026 • 1:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘వా.. వాతియార్’ (Anna Garu Vastaru Movie) దర్శకుడు నలన్‌ కుమారస్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ సినిమా పలు వాయిదాల తరువాత సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మోస్తరు రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే రెండు వారాలు తిరగకముందే ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండానే సడన్‌గా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.‘అన్నగారు వస్తారు’ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) దక్కించుకుంది.

Read Also: Plane Crash: విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే!

ఈ మేరకు ఈ నెల 28 నుంచి ఈ సినిమా (Anna Garu Vastaru Movie) ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, నిళల్‌గళ్ రవి, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జి.ఎం. సుందర్, మధుర్ మిట్టల్ వడివుక్కరసి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. మరి థియేటర్స్ లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

కథేంటంటే

లెజెండరీ నటుడు ఎంజీఆర్‌కు వీరాభిమాని అయిన తాత పాత్రలో రాజ్‌కిరణ్‌ కనిపిస్తారు. ఆయన తన మనవడు రామేశ్వరన్‌ (కార్తీ)ను కూడా ఎంజీఆర్‌లా నిజాయతీగా, ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటాడు. తాత ఆశయాల ప్రభావంతో రామేశ్వరన్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా మారతాడు. కానీ బయటకు కనిపించే నిజాయతీకి భిన్నంగా, లోలోపల అతడు లంచాలు తీసుకుంటూ అవినీతిపరుడిగా జీవిస్తుంటాడు. ఒక దశలో తాతకు మనవడి అసలు స్వభావం తెలిసిపోవడం,

ఆ బాధను తట్టుకోలేక ఆయన మరణించడం కథలో కీలక మలుపు.తాత మరణం తర్వాత రామేశ్వరన్‌లో తీవ్రమైన అపరాధ భావం మొదలవుతుంది. తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎంజీఆర్‌ సినిమాల ప్రభావంతో, తాత ఆశయాలను గుర్తు చేసుకుంటూ నిజాయతీగల పోలీస్‌ ఆఫీసర్‌గా మారే ప్రయాణమే ఈ సినిమా ప్రధాన కథ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

karthi latest news Telugu News Va Vaathiyar Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.