📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Anirudh Ravichander: యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

Author Icon By Aanusha
Updated: March 17, 2026 • 10:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Anirudh Ravichander: వరుస సినిమాలతో దక్షిణాది సినీ సంగీతాన్ని ఊపేస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రపంచంలో తన మార్క్ చూపించడానికి సిద్ధమయ్యారు. గ్లోబల్ మ్యూజిక్ దిగ్గజం యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో అనిరుధ్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం భారతీయ సంగీత రంగంలో ఒక కీలక మలుపుగా మారనుంది.

Read Also: Renu Desai: రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్

సౌత్ మ్యూజిక్ కల్చర్‌కు గ్లోబల్ ప్లాట్‌ఫామ్

దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఉన్న మ్యూజిక్ కల్చర్‌ను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లాలని ఆ సంస్థ గట్టిగా భావిస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న అనిరుధ్ తో జట్టుకట్టింది. తన అల్బుకర్క్యూ రికార్డ్స్ ద్వారా ఇండియన్ ఇండిపెండెంట్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తన లక్ష్యమని, దానికి పాప్, హిప్-హాప్ మ్యూజిక్‌లో ఎంతో అనుభవం ఉన్న యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా సరైన భాగస్వామి అని అనిరుధ్ చెప్తున్నాడు. కొత్త తరం మ్యూజిక్ ఆర్టిస్టులను ప్రోత్సహించి వారి టాలెంట్‌ను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి చేర్చడానికి, అలాగే సౌత్ ఇండియన్ పాప్, హిప్-హాప్ రేంజ్‌ను పెంచడానికి ఈ డీల్ బాగా ఉపయోగపడుతుంది.

‘Anirudh’ signs deal with Universal Music India

భారతీయ సంగీత భవిష్యత్తు అనిరుధ్ లాంటి ప్రతిభావంతుల చేతుల్లోనే ఉందని యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా చైర్మన్ & సీఈఓ దేవరాజ్ సన్యాల్ ప్రశంసించారు. డిఫరెంట్ స్టైల్‌తో మ్యూజిక్ క్రియేట్ చేసే అనిరుధ్ కొత్త ప్రయాణానికి సపోర్ట్ చేయడం తమకు గర్వకారణం అన్నారు. అలాగే, యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సనుజీత్ భుజబల్ మాట్లాడుతూ.. సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా, తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను అనిరుధ్ క్రియేట్ చేసుకున్నాడని చెప్పారు. అల్బుకర్క్యూ రికార్డ్స్ ద్వారా ఇండియన్ పాప్ (I-Pop), హిప్-హాప్ మ్యూజిక్‌లో రాబోయే రోజుల్లో అనిరుధ్ సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఇటు వరస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద కూడా తనదైన పట్టు చూపిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Albuquerque Records Anirudh Ravichander I-Pop Independent Music India South Indian Pop Universal Music India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.