📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: ‘Andhra King Taluka’ Movie: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: November 27, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా (‘Andhra King Taluka’ Movie) పై ఆడియన్స్‌లో పాజిటివ్‌ బజ్‌ క్రియేటైంది.ఇందులో రామ్‌ ఓ అభిమానిగా, ఉపేంద్ర ఓ సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారనీ తెలియగానే సినిమాపై తెలీని ఆసక్తి జనాల్లో నెలకొన్నది. ఇక పొతే, డబుల్ ఇస్మార్ట్, స్కంద లాంటి పరాజ్యాల తర్వాత రామ్ పోతినేని నుంచి వచ్చిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా (‘Andhra King Taluka’ Movie). ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

Read Also: Goa: గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా ఎపి శకటం

కథ

ఈ సినిమా కథ గోదావరి జిల్లాలో 2002 ప్రాంతంలో మొదలవుతుంది. సూర్య (ఉపేంద్ర) పేరుమోసిన సూపర్‌స్టార్‌. అయితే.. తనకు బ్యాడ్‌ పిరియడ్‌ నడుస్తూ ఉంటుంది. విడుదలైన సినిమాలన్నీ ఫ్లాపులవుతుంటాయి. ఈ క్రమంలో సూర్య వందవ చిత్రం షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోతుంది. చిత్రాన్ని నిర్మించలేనని నిర్మాత చేతులెత్తేస్తాడు. ఓ మూడు కోట్లు ఉంటే సినిమా పూర్తవుతుంది. ఆ మూడు కోట్ల కోసం సూర్య ప్రయత్నాలు మొదలుపెడతాడు.

ఈ క్రమంలో ఓ నిర్మాతను డబ్బు అడుగుతాడు. అతను తన కొడుకు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో తండ్రి పాత్ర వేస్తే డబ్బు సర్దుతానంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సమకూరకపోవడంతో చివరికి ఆ నిర్మాత పెట్టిన షరతుకి ఓకే చెప్పాలనుకుంటాడు. తన నిర్ణయాన్ని ఆ నిర్మాతకు చెప్పేలోపే సూర్య అకౌంట్‌లో మూడు కోట్లు పడతాయి.

కథనం

ఆ డబ్బు ఎవరు వేశారో సూర్యకు అర్థం కాదు. రాజమండ్రి దగ్గర్లోని ఓ పల్లెటూరి కుర్రాడు ఆ మూడు కోట్లు వేశాడని తెలిసి సూర్య షాక్‌ అవుతాడు. అతను తన అభిమాని తెలుసుకున్న సూర్య.. అతన్ని కలవాలని బయలు దేరతాడు? మరి సూర్య అభిమానిని కలిశాడా? ఓ పల్లెటూరి కుర్రాడికి ఈ మూడు కోట్లు ఎలా వచ్చాయి? అసలు ఆ కుర్రాడెవరు? అతని కథేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.

Andhra King Taluka’ Movie

ఈ సినిమాలో హీరోపై ఒక ఫ్యాన్ పెచ్చుకున్న అభిమానం ఎలా ఉంటుందో చూపించారు.. ప్రేమించిన అమ్మాయి కంటే తన హీరోనే తనకి ఎక్కువ అనే పిచ్చిని చూపించారు.. ఫ్యాన్స్‌ అంటే ఎలా ఉంటారో మరోసారి గుర్తుచేశారు. . నిజానికి ఈ సినిమా అభిమానులు కాదు.. హీరోలు కూడా చూడాలి.

నటీనటులు

ఈ సినిమాకి ప్రధాన బలం మాత్రం హీరో రామ్ యాక్టింగ్ అనే చెప్పాలి. ఇప్పటివరకూ రామ్ చాలానే రోల్స్ చేశాడు. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా, మాస్ హీరోగా ఇలా చాలానే చేశాడు. కానీ ఇందులో ఒక అభిమానిగా రామ్ (Ram Pothineni) జీవించాడు. తన హీరో సినిమా కోసం కటౌట్లు పెట్టడం నుంచి ఫ్యాన్ వార్స్ అంటూ కొట్టుకోవడం వరకూ.. థియేటర్లో పేపర్లు చింపడం నుంచి పేపర్లో తన హీరో ఫొటో చూసి మురిసిపోవడం వరకూ..

అభిమానంతో మొదలై హీరో మీద పెంచుకున్న పిచ్చి వరకూ.. ప్రతి సీనులోనూ రామ్ యాక్టింగ్ చాలా బావుంది.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా చేశాడు. భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ బాగుంది. ఉపేంద్ర ఉన్నంత సేపు సినిమా అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ లో ఆయన జీవించాడు. మిగిలిన పాత్రలలో మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra King review latest news Telugu cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.