📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Andhera Web series: అంధేరా (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ

Author Icon By Anusha
Updated: August 15, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో హారర్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఇటీవల కాలంలో మంచి డిమాండ్‌ను సంపాదించుకున్నాయి.ఈ తరహా జానర్లలో వచ్చే కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ అంశాలతో కూడిన కథాంశంతో ‘అంధేరా’ అనే వెబ్ సిరీస్ (Andhera Web series) రూపొందింది. టైటిల్ నుంచే ఒక రహస్యమైన ఫీల్‌ను ఇస్తూ, ట్రైలర్‌లో చూపించిన టెన్షన్ ఫుల్ సన్నివేశాలు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఈ సిరీస్‌ను రాఘవ్ దార్ దర్శకత్వం వహించగా, ఆగస్ట్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. మొత్తం 8 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్, ప్రతి ఎపిసోడ్ సుమారు 40 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది.

కథ

ముంబైలో కల్పన ( ప్రియా బాపట్) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ధైర్యవంతురాలైన ఆఫీసర్. అయితే గతంలో జరిగిన ఒక సంఘటన ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. ‘బాని బారువా’ అనే స్త్రీకి సంబంధించిన మిస్సింగ్ కేసు (Missing case) ఆమె దగ్గరికి వస్తుంది. దాంతో ఆ కేసును పరిశోధించడానికి ఆమె రంగంలోకి దిగుతుంది. కల్పన ఈ కేసు పనిపై బాని బారువా ఇంటికి వెళ్లగా,ఆమె తల్లిదండ్రులు చిత్రంగా ప్రవర్తించడం అయోమయంలో పడేస్తుంది.   ముంబైలోనే జయసేథ్ (కరణ్ వీర్) మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా ఉంటాడు. ఆయన అన్నయ్య పృథ్వీ ఒక హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి వాళ్లిద్దరూ కారులో ఇంటికి తిరిగొస్తూ ఉండగా, ప్రమాదానికి గురవుతారు. ఆ సంఘటన కారణంగా పృథ్వీ ‘కోమా’లోకి వెళతాడు. జయసేథ్ మాత్రం సురక్షితంగా బయటపడతాడు. ప్రమాద సమయంలో తన అన్నయ్యను ఒక ‘అంధకారం’ అలుముకోవడాన్ని అతను చూస్తాడు. ఆ చీకటి రూపాన్ని గురించి అతను సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే అతనికి ‘రూమి’తో పరిచయమవుతుంది.

Andhera Web series

కథనం

‘బాని బారువా’ కేసుతో పృథ్వీకి సంబంధం ఉందనే విషయాన్ని కల్పన కనిపెడుతుంది. బాని బారువా చనిపోయిందనే విషయాన్ని జయసేథ్ ద్వారా తెలుసుకుని షాక్ అవుతుంది. అతని నోటి నుంచే ‘అంధకారం’ అనే మాటను ఆమె మొదటిసారిగా వింటుంది. అక్రమంగా పృథ్వీ చేసిన ఒక ప్రయోగం వికటించి, అందులో నుంచే అంధకార శక్తి పుట్టుకొచ్చిందని తెలుసుకుంటుంది. పృథ్వీతో ఆ ప్రయోగం చేయించింది ఎవరు? దాని వెనుక ఉన్నవారి ఉద్దేశం ఏమిటి? ఈ కేసు పరిశోధనలో కల్పనకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ.  ‘అంధేరా’ .. అనే టైటిల్ కి తగిన కథతోనే సాగే సిరీస్ ఇది. అమ్మ కడుపులో ఉండగా అంతా చీకటిగానే ఉంటుంది. మరణించిన తరువాత చేరుకునేది కూడా అనంతమైన అంధకారంలోకే. జీవితంలో ఆరంభంలోను ,ముగింపులోను తోడుగా ఉండే చీకటిని చూసి భయపడకూడదు. అలాంటి చీకటితో సహవాసం చేయాలి అంటూ ఒక నెగెటివ్ కేరక్టర్ చెప్పే మాటలే ఈ కథకి పునాదిగా చెప్పుకోవచ్చు

“Andhera” వెబ్ సిరీస్ అంటే ఏమిటి?

“Andhera” అనేది క్రైమ్–థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఒక వెబ్ సిరీస్. ఇందులో సస్పెన్స్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉంటాయి.

“Andhera”లో నటించిన ముఖ్య నటులు ఎవరు?

ఇందులో కొన్ని ప్రముఖ టీవీ వెబ్ నటులు నటించారు. అయితే, కథలో ప్రధాన పాత్ర పోషించిన హీరో, హీరోయిన్, మరియు విలన్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/coolie-movie-rajinikanths-coolie-is-a-tsunami-of-collections/cinema/530685/

andhera web series Breaking News Crime Thriller latest news ott horror thriller raghav dar director streaming from august 14 supernatural thriller suspense thriller Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.