Allu Sirish: పవన్ కళ్యాణ్‌, నాగబాబుకు అల్లు శిరీష్ పెళ్లి పిలుపు!

Read Time:  1 min
Allu Sirish: పవన్ కళ్యాణ్‌, నాగబాబుకు అల్లు శిరీష్ పెళ్లి పిలుపు!
FONT SIZE
GET APP

Allu Sirish: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. మార్చి 6న జరగనున్న తన వివాహ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రికల పంపిణీలో శిరీష్ బిజీగా ఉన్నారు.

తాజాగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నివాసానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆన్నా లెజ్నేవాకు పెళ్లి శుభలేఖను అందజేసి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also: Vijay Deverakonda-Rashmika: ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక 

Allu Sirish: పవన్ కళ్యాణ్‌, నాగబాబుకు అల్లు శిరీష్ పెళ్లి పిలుపు!
Allu Sirish: Allu Sirish’s wedding invitation to Pawan Kalyan and Nagababu!

పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, ఆయన భార్య పద్మజను కూడా శిరీష్ దంపతులు కలిసి వివాహానికి రావాలని కోరారు. “పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు నా పెళ్లి జరుగుతుండడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు” అని శిరీష్ తన పోస్టులో పేర్కొన్నారు.

మార్చి 6నే పెళ్లి.. స్పెషాలిటీ ఏంటంటే?

అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికా రెడ్డిని మార్చి 6న వివాహం చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌లో ఈ వివాహం సంప్రదాయబద్ధంగా జరగనుంది. విశేషమేమిటంటే, మార్చి 6వ తేదీ శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల పెళ్లి రోజు. వారు 2011లో ఇదే తేదీన ఒక్కటయ్యారు. గతేడాది అక్టోబర్ 31న శిరీష్-నయనికా రెడ్డిల నిశ్చితార్థం జరగ్గా, దుబాయ్‌, హైదరాబాద్‌లలో గ్రాండ్‌గా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.