📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Dhurandhar Movie: ‘ధురంధర్’ పై అల్లు అర్జున్ ప్రశంసలు

Author Icon By Anusha
Updated: December 12, 2025 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’ (Dhurandhar Movie) సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు అగ్ర క‌థానాయ‌కుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). తాజాగా ఈ సినిమాను వీక్షించిన బ‌న్నీ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు. చిత్ర బృందాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. సినిమా అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని అన్నారు.

Read Also:  Pawan Kalyan: ప‌వన్ కళ్యాణ్ పిటిషన్‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

“ఇప్పుడే ‘ధురంధర్’ సినిమా (Dhurandhar Movie) చూశాను. అత్యుత్తమ నటన, అద్భుతమైన సాంకేతికత, అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లతో కూడిన గొప్ప చిత్రం ఇది” అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నా సోదరుడు రణ్‌వీర్ సింగ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలిచాడు” అంటూ కితాబిచ్చారు.

నిర్మాతలకు శుభాకాంక్షలు

అలాగే అక్షయ్ ఖన్నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉందని, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలలో జీవించారని కొనియాడారు. హీరోయిన్ సారా అర్జున్ నటన కూడా ఆకట్టుకుందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌ను ‘కెప్టెన్’ అని సంబోధిస్తూ, ఎంతో పట్టుదలతో ఈ చిత్రాన్ని విజయవంతంగా రూపొందించారని అభినందించారు. చిత్ర బృందం, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Allu Arjun Dhurandhar movie latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.