📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Allu Arjun Dhurandhar 2 Review: ‘ధురంధర్ 2’పై అల్లు అర్జున్ రివ్యూ

Author Icon By Anusha
Updated: March 19, 2026 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Allu Arjun Dhurandhar 2 Review: బాలీవుడ్ సెన్సేషనల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయి మేకింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని బన్నీ పేర్కొన్నారు.

Read Also: Ram Charan Tilak Varma Meeting: ‘పెద్ది’ సెట్స్‌లో తిలక్ వర్మ సందడి!

ఇదొక బ్లాక్‌బస్టర్ బ్లాస్ట్

సినిమా చూసిన వెంటనే ఆయన తన స్పందనను తెలియజేస్తూ.. “దేశభక్తిని చాలా స్టైలిష్‌గా (Patriotism with Swag) చూపించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉన్న ఈ సినిమాలో విపరీతమైన ఈలలు, చప్పట్లు కొట్టించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇదొక బ్లాక్‌బస్టర్ బ్లాస్ట్!” అని పేర్కొన్నారు.‘ఇప్పుడే ‘ధురంధర్ 2’ చూశాను. దేశభక్తిని చాలా స్టైలిష్‌గా ఇందులో విపరీతమైన ఈలలు, చప్పట్లు కొట్టించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమా అదిరిపోయింది. చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మాధవన్ సహా మిగిలిన నటీనటులందరూ అద్భుతంగా నటించారు.

సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. మా సోదరుడు రణవీర్ సింగ్ లాంటి ప్రతిభావంతుడైన, వైవిధ్యమైన నటుడు మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. రణవీర్ తన నటనతో నిప్పులు చెరిగారు. దర్శకుడు ఆదిత్య ధర్ గారు సిక్సర్ కొట్టారు (Hit the ball out of the park). ఆయన వంటి గొప్ప దర్శకులు మన దేశంలో ఉండటం మన అదృష్టం. సినిమా మామూలుగా లేదు.. అదరగొట్టేశారు. ఒక భారతీయ కథను..అంతర్జాతీయ స్థాయిలో చూపించారు! జై హింద్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aditya Dhar Dhurandhar 2 Allu Arjun Dhurandhar 2 Review Dhurandhar 2 Movie Updates Telugu Entertainment News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.