గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, 2026 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈసారి సినీరంగం నుంచి ఆరుగురిని పద్మ పురస్కారాలు వరించాయి.ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా పద్మ అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Read Also: Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్.. గంభీర లుక్‌తో గూస్‌బంప్స్
గర్వకారణమైన క్షణం
ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఈ ప్రతిష్టాత్మక జాతీయ గౌరవానికి పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. పద్మ విభూషణ్ అందుకున్న ధర్మేంద్ర, మమ్ముట్టికి అభినందనలు. పద్మశ్రీ అవార్డును పొందిన మాధవన్, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్‌కు అభినందనలు. టాలీవుడ్ కు దశాబ్దాలుగా చేసిన కృషికి గుర్తింపుగా రాజేంద్ర ప్రసాద్, మురళి మోహన్ పద్మశ్రీ అవార్డును అందుకున్నందుకు తెలుగు సినిమాకు గర్వకారణమైన క్షణం’ అని (Allu Arjun) అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: