📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Allu Arjun: సుకుమార్ బర్త్‌డేకు బన్నీ ఎమోషనల్ ట్వీట్

Author Icon By Tejaswini Y
Updated: January 11, 2026 • 1:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హృదయాన్ని తాకే ట్వీట్‌తో శుభాకాంక్షలు తెలిపారు. సుకుమార్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న బన్నీ, ఆయన పుట్టిన రోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.

Read also: Anaganaga Oka Raju: ఏపీలో ‘అనగనగా ఒకరాజు’ టికెట్‌ ధరల పెంపు

‘‘హ్యాపీ బర్త్‌డే డార్లింగ్. ఈ రోజు నీకంటే నాకు మరింత ప్రత్యేకమైన రోజు. నా జీవితానికి కొత్త దిశను ఇచ్చిన రోజు ఇదే. నీతో ఉన్న అనుబంధాన్ని మాటల్లో పూర్తిగా వ్యక్తపరచలేను. ఈ ప్రపంచంలోకి వచ్చిందానికి థ్యాంక్స్’’ అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

సుకుమార్‌(Director Sukumar)పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని అల్లు అర్జున్ ఇప్పటికే పలుసార్లు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ‘పుష్ప 2’ గ్రాండ్ సక్సెస్ మీట్ సందర్భంగా కూడా ఆయన మాట్లాడుతుండగా భావోద్వేగానికి లోనయ్యారు.

ఆ వేడుకలో బన్నీ మాట్లాడుతూ,
‘‘సుకుమార్ నాకు కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. ఒక భావోద్వేగం. ఆయన లేకపోతే నేను ఈ స్థాయికి చేరేవాడినే కాదు. నేను ఆయనకు అతిపెద్ద అభిమానిని. ఆయన ఓ అసలైన జీనియస్’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Allu Arjun Allu Arjun tweet Director Sukumar Google News in Telugu Icon Star Allu Arjun pushpa 2 success meet Sukumar birthday Telugu Cinema News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.