AA22 Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో వస్తున్న #AA22 చిత్రం రోజుకో సంచలన వార్తతో సినీ ప్రియులను ఊరిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ల జాబితా చూస్తుంటే, అట్లీ ఒక భారీ ‘మల్టీస్టారర్’ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.తాజాగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనుష్క శర్మ కూడా ఈ ప్రాజెక్టులో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే దీపికా పదుకోణె, రష్మిక మందానా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు.
Read Also: Peddi movie Update: రామ్ చరణ్ ‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్
అట్లీ మాస్టర్ ప్లాన్
ఒకే సినిమాలో ఐదుగురు స్టార్ హీరోయిన్లు నటించడం ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన విషయమని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకునే అట్లీ ఇంతమంది బాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న అనుష్క శర్మకు ఈ చిత్రం ఒక బలమైన రీ-ఎంట్రీ అవుతుందని భావిస్తున్నారు.
2017లో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత, అనుష్క తన కుటుంబ జీవితానికి, వ్యక్తిగత ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చారు. తన పిల్లలు వామిక, అకాయ్ సంరక్షణ కోసం, వరుస షూటింగ్‌ల వల్ల కలిగిన అలసట నుండి ఉపశమనం పొందడానికి ఆమె సినిమాలకు విరామం తీసుకున్నారు. పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగు వేస్తున్న అనుష్క, ఇప్పుడు మళ్లీ కెరీర్ పరంగా యాక్టివ్ అవుతుండటం ఆమె అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: