నిన్న జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో తెలుగు సినీ పరిశ్రమలోని అంతర్గత విభేదాలపై నిర్మాత అల్లు అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ‘సైమా’ (SIIMA – South Indian International Movie Awards) బృందం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ వేడుకలో జాతీయ అవార్డులు గెలుచుకున్న తెలుగు సినీ ప్రముఖులను సత్కరించారు.ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, “ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. ఇది మనందరికీ గర్వకారణం. ఈ విజయాన్ని గుర్తించి, సత్కరించడం కోసం సైమా ముందుకు రావడం ప్రశంసనీయం. కానీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి పెద్ద స్థాయి స్పందన కనిపించలేదు” అని అల్లు అరవింద్ (Allu Aravind) వ్యాఖ్యానించారు.
ఎందుకంటే ఇక్కడ ఎవరి కుంపటి వాళ్లదే
ఇది నిజానికి మనందరం కలిసి పండగలా జరుపుకోవాల్సిన సందర్భం. తెలుగు సినిమా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను నిరూపించుకుంటోంది. అలాంటప్పుడు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకోవాలి. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి ఐకమత్యం మన పరిశ్రమలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి కుంపటి వాళ్లదే. ఒక్కో క్యాంప్, ఒక్కో గ్రూప్ తమ పరిధిలోనే ఉండిపోతుంది. ఈ కారణంగానే మనం కలసి మంచి పనులు చేయలేకపోతున్నాం” అని స్పష్టం చేశారు.తెలుగు సినీ పరిశ్రమలో ఎవరూ కలిసి లేరని..షాకింగ్ కామెంట్స్ చేశారు.
అల్లు అరవింద్ స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ ఏది?
గీతా ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించి, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలను నిర్మించారు.
ఆయన నిర్మించిన కొన్ని హిట్ సినిమాలు ఏవి?
మగధీర, గజిని (హిందీ), అల వైకుంఠపురములో, ధ్రువ, బన్నీ, దడ, రేసుగుర్రం వంటి సినిమాలు.
Read hindi news: hindi.vaartha.com
Read also: