ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ 77వ జన్మదినాన్ని(Allu Aravind Birthday) పురస్కరించుకుని ఆయన కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హృద్యమైన శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితంలో తండ్రి స్థానం ఎంతో ప్రత్యేకమని భావోద్వేగంగా పేర్కొంటూ, ఆయనపై తన ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరిచారు.
Read Also: Prabhas: ‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్
ఈ సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ప్రారంభించిన అల్లు సినిమాస్ వద్ద తండ్రితో కలిసి తీసుకున్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నా జీవితంలో దేవుడికి అత్యంత సమీపమైన వ్యక్తి మీరే. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి” అంటూ తన భావాలను పంచుకున్నారు.
గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడిగా అల్లు అరవింద్ టాలీవుడ్‌లో విశేష గుర్తింపు పొందారు. ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘పసివాడి ప్రాణం’, ‘జల్సా’, ‘గజని’, ‘మగధీర’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: