బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆమె అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్లిన ఆలియా, ‘జిగ్రా’ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో కొంత నిరాశకు గురైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
Read also: Gandhi Talks Movie: ‘గాంధీ టాక్స్’ విడుదల ఎప్పుడంటే?
ఏడాదికి ఒక సినిమా
ప్రస్తుతం స్పై యూనివర్స్‌లో భాగంగా ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు. అలాగే భర్త రణబీర్ కపూర్‌తో కలిసి లవ్ అండ్ వార్ మూవీలోనూ నటిస్తున్నారు. అమ్మ అయ్యాక బాధ్యతలు పెరగడంతో, కూతురితో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. ఆల్ఫా సినిమా తర్వాత చేయబోయే సినిమాపై ఇంకా స్పష్టత లేదు. అయితే, ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటంలో మాత్రం రాజీ పడబోనని ఆలియా (Alia Bhatt) తెలిపారు.
తల్లి అయిన తర్వాత యాక్షన్ సన్నివేశాలు చేయడం పెద్ద సవాలేనని కూడా అలియా అంగీకరించింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఆల్ఫా’ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పింది. “బిడ్డ పుట్టిన తర్వాత ఇలాంటి యాక్షన్ సీన్స్ చేయడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. నా శరీరం ఎంత శక్తివంతంగా ఉందో నాకు నేనే తెలుసుకున్నాను. నా శరీరంపై గౌరవం మరింత పెరిగింది” అని చెప్పుకొచ్చింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: