పిల్లలు ఇంటర్నెట్ (Internet) వాడకంలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు, కానీ తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఈ సందర్భంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన కుమార్తెకు ఎదురైన ఒక భయానక అనుభవాన్ని పంచుకుని, తల్లిదండ్రులకు హెచ్చరిక చేశాడు.
Prabhas: కాంతార: ఛాప్టర్ 1 పై ప్రభాస్ ఏమన్నారంటే?
సైబర్ నేరగాళ్లు చిన్నారులను ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో వివరిస్తూ అందరినీ హెచ్చరించారు. శుక్రవారం జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ (‘Cyber Awareness Month 2025’) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ షాకింగ్ ఘటనను ఆయన బయటపెట్టారు.కొన్ని నెలల క్రితం తన కుమార్తె నితార ఇంట్లో ఆన్‌లైన్ వీడియో గేమ్ (Online video game) ఆడుతుండగా ఈ సంఘటన జరిగిందని అక్షయ్ కుమార్ తెలిపారు.
“గేమ్‌లో పరిచయం లేని వ్యక్తితో ఆడుతున్నప్పుడు, మొదట చాలా మర్యాదగా మెసేజ్‌లు వచ్చాయి. ‘గేమ్ బాగా ఆడుతున్నావ్’, ‘చాలా బాగా ఆడావ్’ అంటూ పొగడ్తలతో మెసేజ్‌లు పంపాడు. అంతా బాగానే ఉందనిపించింది” అని ఆయన వివరించారు.ఆ తర్వాత సదరు వ్యక్తి “నువ్వు ఎక్కడి నుంచి?” అని అడగ్గా, తన కుమార్తె ‘ముంబై’ అని సమాధానమిచ్చిందని అక్షయ్ చెప్పారు.
సైబర్ నేరాల బారిన పడి ఎంతోమంది చిన్నారులు
“ఆ తర్వాత, ‘నువ్వు అబ్బాయా, అమ్మాయా?’ అని అడిగాడు. దానికి ఆమె ‘అమ్మాయి’ అని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత, ‘నీ న్యూడ్ పిక్చర్ పంపగలవా?’ అని మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూడగానే నా కూతురు వెంటనే గేమ్ ఆఫ్ చేసి, జరిగిందంతా నా భార్యకు చెప్పింది.
ఆమె అలా చెప్పడం చాలా మంచిదైంది” అని అక్షయ్ కుమార్ అన్నారు.ఇది కేవలం తన కుమార్తె సమస్య కాదని, ఇలాంటి సైబర్ నేరాల బారిన పడి ఎంతోమంది చిన్నారులు బ్లాక్‌మెయిలింగ్ (Blackmailing) కు గురవుతున్నారని, కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం అత్యవసరమని ఆయన నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి వరకు ప్రతి వారం సైబర్‌క్రైమ్‌పై ఒక పీరియడ్ కేటాయించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Chief Minister Devendra Fadnavis) కు ఆయన విజ్ఞప్తి చేశారు. వీధి నేరాల కన్నా ఈ సైబర్ నేరాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: