టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati Srinu) కాంబోలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే.
Read Also: Akhanda-2: తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు
సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన
ఈ రోజు (డిసెంబర్ 4) భారత్‌లో జరగాల్సిన స్పెషల్ ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. “సాంకేతిక కారణాల వల్ల ఇండియాలో ఈ రోజు జరగాల్సిన ప్రీమియర్ (Akhanda 2)షోలను రద్దు చేస్తున్నాము.
మా వంతు మేం ఎంతగానో ప్రయత్నించాం, కానీ కొన్ని అంశాలు మా నియంత్రణలో ఉండవు. అసౌకర్యానికి క్షమించండి” అని పోస్టులో పేర్కొంది. అయితే, ఓవర్సీస్‌లో మాత్రం ప్రీమియర్ షోలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే ప్రదర్శితమవుతాయని స్పష్టం చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: